హిందూపూరంలో స్క్రిప్టు మర్చిపోయిన బాలయ్య

రాష్ట్రంలో అందరి కళ్లు అనంతపురం జిల్లా హిందూ పురం అసెంబ్లీ నియోజకవర్గం మీద ఉన్నాయి.

ఎందుకంటే, ఆ నియోజకవర్గాన్ని టిడిపి నుంచి లాక్కోవాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది. అందుకే అక్కడ రిటైరయిన ఐపిఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్ ను నిలబెట్టింది. ఇక్బాల్ గురించి తెలిసిన వాళ్లు ఆయన లైక్ చేయకుండా ఉండటం కష్టం. ఇక్బాల్ కార్యసాధకుడు. ఎలాంటి డాబు దర్పమూ ఆయన లో ఉండవు. రాయలసీమ ముస్లిం. సామరస్య భావాలున్నావాడు…ఆయన్ని ఈజీగా జనం ‘మా వాడు’ అని అనుకోగలరు. ఇలా ఇక్బాల్ గురించి ఎంతయినా చెప్పుకుంటూ పోవచ్చు.

 

ఇక ఈ నియోజకవర్గానికి వస్తే అది తెలుగు దేశానికి పెట్టనికోట.కంచుకోట. 2014 బాలయ్య తొలిసారి అక్కడి నుంచి పోటీ చేసి గెల్చారు. అక్కడి ప్రజలు టిడిపిని బాగా ఆదరించారు. అసలు అనంతపురం జిల్లానే టిడిపికి అప్పటిగించారు.  అదే ధైర్యం టిడిపిలోనే కొనసాగుతూ ఉంది.

ఇక అక్కడ టిడిపి అభ్యర్థి మామూలు పౌరుడు కాదు.  రాజుగారి బామ్మర్ది, నందమూరి బాలకృష్ణ.

ముఖ్యమంత్రి కి బామ్మర్ధి, టిడిపి నెంబర్ టు కమాండ్ నారా లోకేష్ కు పిల్లనిచ్చిన మామ కావడంతో హిందూపురం ప్రజలు ఇక పండగే అనుకున్నారు. అయితే, అంచనాలు తారుమారయ్యారు.

ఎమ్మెల్యే అనే వాడు ఎపుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు నిత్య జీవితంలో ఎమ్మెల్యే అవసరం చాలా పెరిగింది. అందువల్ల తమ ఎమ్మెల్యేనో కాకుండా ఆయన అసిస్టెటంటో అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అయితే, బాలక్రిష్ట ఏదో షూటింగ్ కు వచ్చినట్లు ఇక్కడి వస్తారు. వచ్చినరెండు రోజులు షూటింగ్ పనులలో అంటే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుపుతూ బిజీబిజీ గా ఉంటారు. షూటింగ్ లో కొద్ది సేపు విరామం తీసుకుని ఇతర నటులతో కాలక్షేపం చేసినట్లు ఆయనటిడిపి వాళ్లతో మాట్లాడి మాయమవుతారు.

నియోజకవర్గంలో అతితక్కువ సార్లు పర్యటించిన వాళ్లకు అవార్డిస్తే ఆ గౌరవం బాలకృష్ణకే దక్కుతుంది. ఆయన అయిదేళ్లలో ఆయన పర్యటనలు 20 మించి ఉండవని చెబుతారు. అసెంబ్లీ సమావేశాలు లేదా ఇతర కార్యక్రమాలుంటే తప్ప ఎమ్మెల్యేలు నియోజకవర్గం దాటరు. దీనికి బాలయ్య భిన్నం.

దీనిని కూడా ఇక్కడి ప్రజలు పట్టించుకునే వాళ్ల కాదు. అయితే, ఆయన హయాంలో రాజ్యాధికారం చంద్రశేఖర్ నాయుడు అనే పిఎకి అప్పగించి పోయాడు. తనులేనిలోటు తీర్చమని చెప్పి బాలయ్య బాబు అంతర్థానమయ్యారు. శేఖర్ అనే పిఎ ఇష్టానుసారం పాలించాడు. రభస అయింది. బాలయ్య ప్రవర్తన జోకయింది.

షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసిపి అభ్యర్థి

బాలయ్యకు నోరు పారేసుకోవడం, చెయి చేసుకోవడం బాగా అలవాటు. అలా ఎంతమంది మీద ఆయన చేయిచేసుకున్నారో, అవన్నీ వీడియోలతో సహా వైరలయ్యాయి. అంతే వేగంగా ఆయన క్షమాపణలు కూడా చెబుతుంటారు.ప్రజల్లో పనిచేసేటపుడు కచ్చితంగా స్క్రిప్టు ఫాలో కావలసిందే.అయితే, మన బాలయ్య మాత్రం స్క్రిప్టు వదిలేశారు.

ఆయన సినిమా హీరో అని అందరికీ తెలిసిందే. ఆ పాత్రని జీవితంలో కూడా పోషిస్తుంటారు. షష్టిపూర్తికి సిద్ధమవుతున్నా ఆయన విగ్గు వదలరు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే, బయట మామూలు మనిషిలాగా బట్టతలతోనే తాతయ్యలాగా కనిపిస్తూ ఉంటారు. ఆయన దానికి జంకరు.

అయితే, బాలయ్య బాబు హీరో ఇమేజ్ ని చాలా జాగ్రత్తగా మేనేజ్‌ చేసుకుంటుంటారు. దానికోసం ఆయన విగ్ లేకుండా కనిపించరు. అందుకే తనకి ఎవరైనా మరీ దగ్గరికి వస్తారేమో,  విగ్ ప్రమాదం జరగుతుందేమోనని భయపడుతూ ఉంటారు. మా నాయకుడొచ్చాడని ఎవరైనా పూలమాల వేసేందుకు గుంపులుగా వచ్చినపుడు ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. మీ అభిమానం మండా నా విగ్గు జారిపోతే ఎట్లా అనేది ఆయన భయం.

ఇలా భయం భయంగా బతకుతూ ఎవరిని దగ్గిరకు రానీయడు. ఆయన అంత దగ్గరకు వెళ్లడు. ‘అనుమతిలేనిదే ఎవరినీ దగ్గరకు రానివ్వరు,’ అనే బోర్డు ఉండదంతే.  ఎవరైనా దగ్గరగా వచ్చినా తాకరాదు .కాదు కూడదని, మా నేత బాలయ్య అని అత్యుత్సాహం చూపితె అది వైరల్ వీడియో… చెంప చెల్లు మనిపిస్తారు. అభిమానం పొంగిపోయినా దూరాన్నుంచే నమస్కారం పెట్టి పోవాలి. అదీ ఎమ్మెల్యే బాలయ్య కథ. అందుకే ఇంత నాజూకయిన ఎమ్మెల్యే ఎందుకనే ప్రశ్న నియోజకవర్గం లో వచ్చింది.

ఇపుడు బాలయ్య మరొక సమస్య తీసుకువచ్చారు.

ఎన్నికలు కాబట్టి బాలయ్య 2014 నాటి ఒక హామీని నిలబెట్టారు. అదేమిటంటే ఫామిలీతో హిందూపూరంలో ఉండటం. భార్య వసుంధరను కూడా ప్రచారం లోకి దించారు. ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ నాయకులంతా ఒకరి పై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దీనిని బాలయ్య క్లైమాక్స్‌ కు తీసుకువెళ్లారు. అక్కడే బావను, పార్టీ ని ఇరుకున పెట్టారు.

జనసేన తో ఉన్న డీల్ మర్చిపోయారు బాలయ్య. స్క్రిప్టునుంచి డీవియేట్ అయ్యారు. జనసేన మీద విరుచుకుపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ ‘జనసేన’ ఎన్నికల గుర్తు ‘గ్లాసు’ మీద పెడీల్ మని కొట్టారు ఈ దెబ్బ దూమారాన్ని సృష్టిస్తున్నది.

‘ఈ ఎన్నికల ఫలితాలతో వైసిపి ‘ఫ్యాన్‌’ ఇంటికి పరిమితయిపోతుంది. ‘గ్లాసు’ బార్‌ లోకి వెళ్లిపోతుంది. కేవలం ‘సైకిల్‌’ మాత్రమే అసెంబ్లీకి చక్కగా వెళుతుంది,’ అంటూ బాలయ్య వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ జనసేనలను టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేశాడు.

ఇది తెలుగుదేశ వర్గాలకే తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు.

కొద్ది రోజులుగా పవన్‌ , చంద్రబాబును పరస్పరం టార్గెట్‌ చేసుకోకుండా కేవలం జగన్‌ ను మాత్రమే టార్గెట్‌ చేస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. మరీ పూర్తిగా  వదిలేస్తే బాగుండదని పవన్ టిడిపిని అపుడపుడు సాఫ్ట్ గా తిడుతుంటారు. చంద్రబాబయితే, పవన్ ను ముట్టుకోవడమే లేదు.