ఏపీలో పరిశ్రమలే ఉండకూడదా పవన్.. ఆ కామెంట్లకు అర్థమేంటో చెప్పు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను ఎప్పటికి పూర్తి చేస్తారో స్పష్టత రావడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అవుతూ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కాలుష్యకారక పరిశ్రమలను అంతం చేస్తాం అంటూ వింత స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. జగన్ సర్కార్ తాజాగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించిన సంగతి తెలిసిందే.

జగన్ ప్రకటనతో ఆయనకు మంచి పేరు రావడంతో పవన్ జనసేన నాయకులకు కాలుష్య కారక పరిశ్రమలను గుర్తించాలని సూచనలు చేశారు. సిమెంట్, ఫార్మా, అటవీ సంపద అనుబంధ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. అయితే పరిశ్రమలు ఎక్కడ ఉన్నా కొన్ని పరిశ్రమల ద్వారా కొంతమేర కాలుష్యం జరుగుతుందని అందరికీ తెలుసు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే కంపెనీలు పని చేస్తాయనే సంగతి తెలిసిందే.

చిన్నచిన్న పరిశ్రమలపై జనసేన దృష్టి పెట్టి ఆ పరిశ్రమలకు నష్టం కలిగిస్తే నష్టపోయేది చిన్నవాళ్లే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జనసేన పార్టీ నాయకులు పరిశ్రమల యజమానుల నుంచి కాలుష్యం పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి వాటికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేస్తే జనసేన ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే మాత్రం ఆయన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టి 2024 ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తే మంచిదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కామెంట్లను విన్న కొందరు నెటిజన్లు ఏపీలో పరిశ్రమలే ఉండకూడదా పవన్ అంటూ ఆయనను ప్రశ్నిస్తుండటం గమనార్హం.