2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో ఒక్కసారిగా టీడీపీ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో టీపీడీ పార్టీ నడవడం సాధ్యపడని విషయమని, ప్రస్తుతం టీడీపీని నడిపే సత్తా ఉన్న పోలిషిషన్ ఆ పార్టీ ఒక్కరు కూడా లేరని విశ్లేషణలు సాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ పైనే పడింది. టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే.. అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్పితే మరెవ్వరి వల్ల కాలేని పని అని జనాల్లో చర్చలు ముదిరాయి. దీంతో తాజాగా ఈ అంశంపై ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేసారు.
జూ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమమై… మీరేమంటారు? అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ…
‘‘మళ్లీ ఆ సీనియర్ ఎన్టీఆర్ వచ్చినా, జూ ఎన్టీఆర్ వచ్చినా ఇక్కడంటూ ఒక ప్లేస్ అంటూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించడం లేదు, ఆయన అవినీతికి పాల్పడుతున్నాడు, ప్రజా సేవ చేయడం లేదు అనే పరిస్థితి ఉంటే ఆ ప్లేస్ దొరుకుతుంది. కానీ జగన్ అలాంటి అవకాశం ఇవ్వడు, ఆయన అలా చేసిన రోజు మీకు నాకు చెప్పండి… మీ ముందే గుంజీలు తీస్తా” అని పోసాని వ్యాఖ్యానించారు.
అలాగే జూ ఎన్టీఆర్ ఎంత నీతిగా, చిత్తశుద్దిగా ఇపుడు రాజకీయాల్లోకి వచ్చినా బండి నడవదు. ఒక హీరో వచ్చి ఆకాశం నుంచి చుక్కలు తీసుకొస్తానంటే నమ్మే రోజులు లేవు. బి ప్రాక్టికల్… హీరో అయితే ఇమేజ్ పెరుగుతుంది, తెలివి తేటలు పెరగవు. ప్రజసేవా దృక్ఫథం పెరగదు. హీరో ఇమేజ్‌కు … రాజకీయాలకు సంబంధం లేదని… పోసాని చెప్పుకొచ్చారు.