Chandrababu – Modi: చంద్రబాబుతో మోదీ ఆలోచన.. ఒక్క మాటతో క్లారిటీ వచ్చేసిందిగా…

ఎన్నికల హడావుడి ముగిసాక, ఏపీ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది “మోదీ వర్సెస్ బాబు” అంశం. ఇది పాత గొడవల గూర్చి కాదు… కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ స్పందనపై రాజకీయంగా ఆసక్తికరంగా మారిన పరిణామం. సీఎం చంద్రబాబు తన ప్రసంగాల్లో మోదీని దేశ నిర్మాతగా పొగడ్తలతో ముంచెత్తారు. కానీ మోదీ మాత్రం అదే స్థాయిలో బాబును మెచ్చుకోవడం లేదు అనే విమర్శలు టీడీపీ వర్గాల్లో వినిపించాయి.

ఇటీవల ప్రధాని మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించినా, చంద్రబాబు పేరు స్పష్టంగా ప్రస్తావించకపోవడం కొందరిలో అసహనాన్ని కలిగించింది. ‘చంద్రబాబు బీజేపీకి ఇచ్చిన మద్దతుకు సరైన గౌరవం లభించదా?’ అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. టీడీపీ నేతలు లోపలగా ఈ అంశంపై చర్చించుకున్నట్టు సమాచారం. పైగా, మోదీ సభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రధానంగా హైలైట్ చేస్తుండడం మరింత చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలోనే చివరికి మోదీ తానే స్వయంగా ‘ఫుల్ స్టాప్’ పెట్టారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన చంద్రబాబు గురించి రహస్యాన్ని వెల్లడించారు. తాను గుజరాత్ సీఎం అయినప్పుడు హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి ఎలా జరిగింది అన్నదాన్ని అర్థం చేసుకునేందుకు అధికారులను పంపించానని, ఆ సమయంలో చంద్రబాబుని ఆదర్శంగా తీసుకున్నానని చెప్పారు. ఇదే మోదీ మాటల్లో చెప్పిన ప్రశంసా వాక్యం.

ఈ ఒక్క మాటే టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. బాబుపై మోదీ అంగీకారం వచ్చిందన్న భావనతో పార్టీ నేతలు ఊపొచ్చారు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు కూటమి ఆత్మీయతను బలోపేతం చేసేలా మారాయి. ఇకపై ‘మోదీ వర్సెస్ బాబు’ అనే చర్చను మరోసారి ఎవరు లేవనెత్తినా, ‘మోదీ రహస్యమే సమాధానం’ అనే విధంగా టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నారు.

పవన్ నిజస్వరూపం || EX IAS Vijay Kumar EXPOSED Pawan Kalyan Role in the Village Boycott || TR