కుటుంబంతో యూరప్ వెళ్లిన జనసేన పవన్: రీజన్ ఇదే

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా యూరప్ వెళ్లారు. ఆయన యూరప్ ట్రిప్ ఏదో సరదాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం వెళ్ళలేదు. ఆయన భార్య కోరిక నిమిత్తం తన కుమారుడికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పని కోసం వెళ్లారు. ఇంతకీ ఆయన భార్య విష్ ఏమిటో, ఆ ఇంపార్టెంట్ విషయం ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింద వివరాలు ఉన్నాయి చదవండి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన భార్య, పిల్లలతో కలసి యూరప్ బయలుదేరి వెళ్లారు. తన కుమారుడు శంకర పవనోవిచ్ కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన కొన్ని లాంఛనాలు ఉన్నాయట. ఈ క్రిస్టమస్ సమయంలోనే అవి పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా కోరడంతో తన కుటుంబంతో కలసి ఆయన యూరప్ వెళ్లారు. క్రిస్టమస్ పండుగ తరువాత ఆయన హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. యూరప్ పర్యటన అనంతరం ఆయన అమరావతిలో ఉండనున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెల్లడించారు పవన్. సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే సంక్రాంతి నుండి జనసేన ఎన్నికల బరిలోకి దూకే క్రాంతి సమయం ఆరంభం కానుంది. అందుకే జనవరి ఒకటో తారీకు నుండి క్షేత్రస్థాయి పర్యటనలతోపాటు ఇక నాయకులందరికి అనుక్షణం అమరావతిలోనే అందుబాటులో ఉంటాను. ఇప్పటికే జనసైనికుల కవాతు ధ్వనితో ఆంధ్ర రాష్ట్రం పరవళ్లు తొక్కుతోంది. రండి… గెలిచి కొత్త తరాన్ని నిలబెడదాం, నిలిచి కొత్త బావుటా ఎగరేద్దాం, కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం. అంటూ జనసైనికులకు ఆయన పిలుపునిచ్చారు.

పూర్తి కాలం అమరావతిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మేరకు పార్టీ నేతలు తగిన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు.