పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో పవన్ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసినా పెద్దగా ఫలితం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన, వైసీపీ కలిసే అవకాశం అస్సలు లేదనే సంగతి తెలిసిందే. అటు పవన్ జగన్ సహాయాన్ని కోరే అవకాశం లేదని ఇటు జగన్ పవన్ సహాయాన్ని కోరే అవకాశం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ జనసేన పార్టీలకు వేర్వేరుగా ఊహించని స్థాయిలో ఓటు బ్యాంక్ ఉంది. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం వల్లే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడమే పవన్ లక్ష్యమైతే టీడీపీతో జత కట్టడమే పవన్ ముందు ఉన్న ఆప్షన్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రెండున్నరేళ్లు చంద్రబాబు నాయుడు, రెండున్నరేళ్లు పవన్ ఏపీ సీఎంగా కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. పవన్ ఇప్పుడు జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసిన ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటాయి.
ప్రజారాజ్యం పార్టీకి ప్రజల్లో దక్కిన స్థాయిలో రాష్ట్రంలో జనసేనకు గుర్తింపు దక్కడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ఒకవైపు సినిమాలకు మరోవైపు రాజకీయాలకు సమయం కేటాయిస్తుండటంతో ప్రజలు జనసేనను నమ్మడం లేదు. పవన్ కళ్యాణ్ జనసేనపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే మాత్రమే పార్టీ పుంజుకునే అవకాశం అయితే ఉంటుంది.