Pawan Kalyan: తమిళనాడులో పొత్తుపై పవన్ కిలక స్పందన.. కమలం సెంటిమెంట్ ప్లస్ అవుతుందా?

తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు అధికారికంగా ప్ర‌క‌టించ‌డం దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పొత్తుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శుక్రవారం రాత్రి గుంటూరులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పొత్తు తమిళ ప్రజలకు మంచి పాలనను అందించేందుకు కీలకంగా మారుతుందని తెలిపారు.

బీజేపీ అగ్రనేతలు అన్నాడీఎంకే నేత పళని స్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయంగా పేర్కొన్నారు పవన్. అలాగే తక్కువ అభివృద్ధి చెందిన జిల్లాలకు ఈ కూటమి పాలన ద్వారా మెరుగైన ఫలితాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు అభివృద్ధి బాటలో సాగుతున్నాయని, తమిళనాడులోనూ అదే స్ఫూర్తి ఉండబోతోందని వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది మధ్యలోనే కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు కీలకంగా ఆలోచించి, పొత్తును ఖరారు చేయడం గమనార్హం. బీజేపీ దక్షిణాదిలో తమ పట్టు పెంచేందుకు ఈ పొత్తు వ్యూహాత్మకంగా ఉపయోగపడనుంది. గతంలో పలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ, ఈసారి మాత్రం ముందస్తుగానే రంగంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది.

పవన్ వ్యాఖ్యలు చూస్తే, ఆయన పూర్తి స్థాయిలో బీజేపీ వ్యూహాలను మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఏర్పడిన ఈ పొత్తు, డీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ ఇవ్వగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. గ్రామ స్థాయిలో బీజేపీ-అన్నాడీఎంకే కలిసిన ప్రచారం కమలం పార్టీకి పెద్ద లాభం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ పై నాదెండ్ల అలక| Analyst Ks Prasad About Clashes Between Nadendla Manohar And Pawan Kalyan | TR