కొత్తతరం రాజకీయాలు చెయ్యడానికి, రాష్ట్రానికి నూతన మార్గంలో నడిపించడానికి జనసేన పార్టీని స్థాపించానని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అయితే ఆయన చేస్తున్న పనులు మాత్రం చాలా పాతతరం రాజకీయ నాయకుల కంటే కూడా ఘోరంగా ఉంటాయి. అవినీతిపై, అక్రమాలపై మా పార్టీ పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న స్నేహాలు చూస్తుంటే మాత్రం తన స్వలాభం కోసం ఎంత వరకైనా వెళ్తాడనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ పార్టీ ప్రారంభం నుంచి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లింగమనేని ఎస్టేట్స్ అధినేత లింగమనేని రమేష్‌తో స్నేహంగా ముందుకు సాగారు. పార్టీకి అవసరమైన నిధుల సేకరణ, పార్టీ కార్యాలయం ఏర్పాటు.. మౌలిక సదుపాయాలు.. అతిథులు ఎవరైనా వస్తే.. చూసుకునే బాధ్యతలను సంపూర్ణంగా లింగమనేని అధినేత చూసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం పాలైంది. అప్పటి నుండి లింగమనేని పవన్ కు దూరంగా ఉంటున్నారు. పార్టీకి అవసరమైన నిధులు కూడా ఇవ్వడం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పవన్ చేస్తున్న స్నేహాలు ఆ వార్తలను నిజం చేస్తున్నాయి.
లింగమనేని దూరమైన తరువాత ఇప్పుడు ప్రముఖ ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మేఘా అధినేత కృష్ణారెడ్డితో జనసేనాని పవన్ కల్యాణ్ స్నేహం మొదలైందని అంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోని డోకిపర్రులో కృష్ణారెడ్డి నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పవన్ కల్యాణ్ కనిపించారు. దీంతో ఆయనతో స్నేహం మొదలైందని వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో మేఘా కంపెనీ రాష్ట్రంలో పోలవరం (ప్రాజెక్టులో కొంత భాగం) పనులు చేపట్టింది. దీనిలో అవినీతి జరిగిందని గతంలో పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇలా అవినీతి జరిగిందని తాను కూడా ఆరోపించి, ఇప్పుడు అలాంటి వ్యక్తులతో పవన్ స్నేహం చేస్తున్నారు. ఇలా పవన్ చేస్తున్న రాజకీయాలు ఎవ్వరికి అర్ధం కావడం లేదు.