జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర చేపట్టి పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఆయన చేపట్టిన ధవళేశ్వరం బ్రిడ్జిపై జనసేన కవాతు పోలీసుల ఆటంకాలు ఎదురైనప్పటికి దిగ్విజయంగా ముగిసింది. ఈ జనసేనకవాతుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. జనసేన కవాతు ముగిసింది. అనంతరం భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. సభాస్థలికి కారులోనే వెళ్లాలని పోలీసులు సూచించాచగా పవన్ కళ్యాణ్ కారులోనే సభాస్థలికి వెళ్లారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును దులిపేశారు. లోకేష్ ని టార్గెట్ చేసి పంచ్ డైలాగ్స్ వేశారు. ప్రతిపక్ష నేతపై కూడా విమర్శలు చేసారు.
సభలో మాట్లాడుతూ… తూర్పు గోదావరిలో ఇంత ప్రేమ ఉంటుందని కల్లో కూడా ఊహించలేదు అని పవన్ అన్నారు. జనసేన పార్టీ కవాతుకు తరలివచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆయన ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది. తల్లి గోదావరి ప్రవాహంలో జాలువారే తెల్లని ముత్యాలు నా తెలుగింటి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లు అన్నారు పవన్. గోదావరి తీరంలో ఉన్న ఆలయాల్లో దేవతలని చాలా సున్నితంగా స్పృశించే లేలేత కిరణాలూ నా తెలుగింటి ఆడపడుచులు అని అభివర్ణించారు. మదమెక్కిన మహిషాసురులువంటి మానవ మృగాల్ని తెగ నరికే దుర్గా దేవి ప్రతి రూపాలు అన్నారు. అటువంటి ఆడపడుచులకు జనసేన పార్టీ తరపున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
జనసేన పార్టీ బాధ్యతతో, క్రమశిక్షణతో నడిచే పార్టీ అన్నారు. నేను ఒక స్థానికుడిని, ప్రజల పక్షాన నడిచేవాడిని అన్నారు. తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటే లేస్తారు అలాంటిది రాజకీయ వ్యవస్థను నడపాల్సిన పెద్దలే కాల్చి చంపేయండి, ఉరి తియ్యండి అంటూ ప్రతిపక్ష నాయకుల్లాగా…అధికార పక్ష నాయకులూ ప్రతిపక్ష నాయకుల్ని సంతలో జంతువుల్ని కొన్నట్టు కొంటున్నారు అని విమర్శించారు. ఇవన్నీ సగటు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి అన్నారు.
ఒక పార్టీని నడపాలంటే నాయకుడికి అనుభవం ఉండాలనే ఉద్దేశంతోనే 2009 , 2014 లో ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాలేదన్నారు. బాధ్యతతో, రాష్ట్ర శ్రేయస్సు కోసం, దేశ భక్తితో నేను 2014 లో పోటీ చేయకుండా అనుభవజ్ఞుడని నారాచంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశాను అన్నారు. ఏమి ఆశించకుండా రాష్ట్రానికి మంచి పాలనా ఇవ్వాలని కోరుకుంటూ వారి పార్టీకి మద్దతు ఇచ్చాను. దానికి బదులుగా ఆయన ఏమిచ్చారు? కనీసం అమరావతిలో ఒక పార్టీ బిల్డింగ్ నిర్మించుకోవడానికి కూడా నాకు ఆస్కారం ఇవ్వలేదని వెల్లడించారు.
ఇంటికెళ్తే టీ ఇచ్చి మర్యాద చేస్తారు కానీ చంద్రబాబుకి జనసేన పార్టీ బ్రతకకూడదు, జనసేన భావజాలాలు ప్రజల్లోకి వెళ్లకూడదని, జనసేన టీడీపీ పల్లకిని మోస్తూ ఉండాలని ఆశిస్తారు. నేను టీడీపీ ని మోయడానికి జనసేన పెట్టలేదు. 2014 లో ఓట్లు చీలకూడదని బాధ్యతగా అండగా ఉన్నాను. అలాంటిది ముఖ్యమంత్రిగారు నన్ను ఏరోజు కూడా ఒక స్పెషల్ కేటగిరి విషయంలో ఒకసారి కూడా సంప్రదించలేదు. కానీ మీకు ఓట్లు కావాలి, జనసేన అండగా కావాలి అని చంద్రబాబును ఉద్దేశించి మండి పడ్డారు.
ఏ మూలకి వెళ్లినా కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా బాబు ఫెయిల్ అయ్యారని ఆగ్రహించారు. గోదావరి ఒడ్డున ఇసుక తెన్నెలు అందంగా కనిపించేవి. కానీ ఈనాడు ఇసుక దోపిడీలు, ఇసుక మాఫియాలు పెరిగిపోయాయి అన్నారు. ఏ మూలకి వెళ్లినా అవి జన్మభూమి కమిటీల గుండాల కమిటీల అర్ధం కావట్లేదు. జన్మభూమి కమిటీల దోపిడీ కమిటీల తెలియట్లేదు అని దుయ్యబట్టారు.
విజయవాడ నుండి వస్తుంటే దారి పొడవునా బాబూ…మళ్ళీ మీరే రవళి అని హోల్డింగ్స్ ఉన్నాయి. వచ్చి ఏం చేస్తారు అని ప్రశ్నించారు. నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ కుటుంబాన్నిదూషించారు. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు. అది మీరు నాకిచ్చిన గిఫ్ట్ అని ఆవేదన చెందారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి రాజమండ్రి నుండి చెబుతున్నాను… సమాజానికి సేవ చేయాలనీ 14 ఏళ్ళ వయసులో నిర్ణయించుకున్నాను నేను. అది మా అన్నయ్యకి తెలియదు. మా అమ్మానాన్నలకు తెలుసు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అంటారు మరి మీ కొడుకు లోకేష్ కి ఏం తెలుసని ప్రశ్నించారు పవన్. పంచాయతీ ఎన్నికల్లోపోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని చేసారు. మీ ఇద్దరికీ ఏం తెలుసని పంచాయతీ గురించి ఆయనని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని చేసారు అని నిలదీశారు.
ఎక్కడైనా తాండ్ర వారసత్వం కొడుక్కి రావాలి. తాండ్ర వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, రూపు రేఖలు, తండ్రి డిఎన్యే, తండ్రి ఆస్తులుపాస్తులు. తండ్రి అనుభవం కొడుక్కి వస్తదా? నేను జనసేన పెట్టింది మీ కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికా? అని నిలదీశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.