Pawan Kalyan: చంపేస్తామంటూ డిప్యూటీ సీఎంకు బెదిరింపు ఫోన్ కాల్స్.. నాగబాబు సంచలన ట్వీట్!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తాము అంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారు దీంతో ఒక్కసారిగా యంత్రాంగం అధికారులు మొత్తం అప్రమత్తమయ్యారు. ఆయనను వదిలేది లేదంటూ ఓ అపరిచితుడు డిప్యూటీ సీఎం పేషీకీ అసభ్యకరమైన మెసేజ్ లు పంపటం అంతటా చర్చగా మారింది. ఈ విషయాన్ని అధికారులు వెంటనే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా మెసేజ్ లు పంపినది ఫోన్ కాల్ చేసినది ఎవరు అనే విషయంపై పోలీసు అధికారులు కూడా ట్రేస్ చేస్తూ అగంతకుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ విషయంపై హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందించారు నిందితులు ఎవరైనా ఉపేక్షించేది లేదని వారికి కఠినమైన చర్యలు తప్పవని ఈమె వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయాలలో దూకుడు కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేశారని తెలుస్తోంది ఇక ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేయడంతో నిందితుడు లబ్బీపేటలో ఉన్నట్లు సెల్‌ఫోన్ ట్రాక్ చేసి పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే లబ్బీపేటకు వెళ్లే సరికి ఆ అగంతకుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు అయితే టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని కనుగొనే పనిలో అధికారులు ఉన్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ అలాగే మెసేజ్లు రావడంతో ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ప్రపంచంలో అత్యంత సులభమైన పని ఏదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ తో స్నేహం చేయటమేనని నాగబాబు తెలిపారు. పవన్‌తో స్నేహం చేయడం, అతనితో జట్టు కట్టడం, అతనికి సన్నిహితుడిగా ఉండడం, కానీ అతని శత్రువుగా అవ్వాలంటే మాత్రం చాలా అర్హతలు కలిగి ఉండాలి అంటూ నాగబాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.