టిజి వెంకటేష్ దుమ్ము దులిపిన జనసేన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం ప్రదర్శించారు. టిడిపి కర్నూలు నేత, రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మీద పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. పవన్ గరం గరం కామెంట్స్ చేయడంతో ఆంధ్రా రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ కామెంట్స్ నేపథ్యంలో టిజి వెంకటేష్ కు చంద్రబాబు నుంచి అక్షింతలు పడ్డాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కార్యకర్తల సభలో ఏమన్నారో కింద చదవండి.

నేను ఏమీ ఆశించకుండా మేము గత ఎన్నికల్లో టిడిపికి మద్దతు ఇచ్చాను. మేము వదిలేసిన రాజ్యసభ సీటు, జనసేన పడేసిన సీటును తీసుకున్న టిజి వెంకటేష్ అనే వ్యక్తి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేదిలేదు.

నదులు, పర్యావరణాన్ని కలుషితం చేసే టిజి వెంకటేష్ కు ఒక్కటే చెబుతున్నా. పనికిమాలిన మాటలు మాట్లాడితే మరోరకంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది.

నేను వద్దనుకుని పడేసిన రాజ్యసభ సీటు తీసుకున్నావు జాగ్రత్త. తెలిసి తెలియకుండా మాట్లాడకు. పెద్ద మనిషివని గౌరవం ఇచ్చాను. పెద్దరికం నిలబెట్టుకోవాలి. పనికిమాలిన మాటలు మాట్లాడితే జాగ్రత్త.

జనసేన ఎన్నికల కోసం వచ్చిన పార్టీ కాదు. కార్పొరేటర్, కౌన్సిలర్ పదవి కూడా ఆశించకుండా మేము మీకోసం పనిచేస్తే అధికారంలోకి వచ్చారు. కర్నూలు పారిశ్రామికవేత్త టిజి వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు.

ప్రజల మనోభావాలతో ఆడుకోకు. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తు పెట్టుకో. ఎందుకు విసిగిపోయామంటే? మాది ఎలక్షన్ కోసం వచ్చిన పార్టీ కాదు గుర్తు పెట్టుకో అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే టిజి వెంకటేష్ ఏమన్నారో కింద చదవండి.

ఇద్దరు నాయకుల అభిప్రాయం మేరకు కలయిక జరుగుతుంది. ముందు నుంచీ జనసేన నాయకులు చెబుతున్న మాటలు చూస్తేనే ఉన్నాం. ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలన్న ఆశ లేదు అని జనసేన అధినేత పవన్ చెబుతున్నారు. ఇది నాయకుల మధ్య చర్చించి తీసుకోవాల్సిన నిర్ణక్ష్ం.

కార్యకర్తల స్థాయిలో నిర్ణయం ఉండదు. నేను కార్యకర్తను మాత్రమే. కలవడం మాత్రం జరుగుతుందని అనుకుంటున్నాను. మాకెన్ని సీట్లు, మాకెన్ని సీట్లు అన్నది తేలాల్సి ఉంది. కేంద్ర మీద పోరాడేందుకు కలవాల్సిన అవసరం ఉంది. 

పొలిటికల్ గేమ్ ఉంటుంది. మా బాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరే తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తామని ఎక్కడా చెప్పలేదు. తెలంగాణలో మేము మరిన్ని ఎమ్మెల్యే సీట్లు అడిగేవాళ్లం. కానీ వాళ్లు ఎన్ని ఇస్తే అన్నే తీసుకుని పోటీ చేశాము.

చంద్రబాబు గుస్సా

టిజి వెంకటేష్ కామెంట్స్ నేపథ్యంలో చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. టిజి వెంకటేష్ ఏం మాట్లాడారో వాకబు చేశారు. వ్యక్తిగతమైన అభిప్రాయాలను మీడియాకు వెల్లడించరాదని చంద్రబాబు గుస్సా అయ్యారు. పార్టీ విధానాలపై స్పందించేటప్పుడు సంయమనంతో మాట్లాడాలని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఆచితూచి మాట్లాడాలని సూచించారు.

అయితే ఎపి రాజకీయాల్లో జనసేనతో టిడిపి మైండ్ గేమ్ ఆడుతోందని పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారు. ఆంధ్రా రాజకీయాల్లో వామపక్షాలతో పొత్తు తప్ప మిగతా ఏ పార్టీతోనూ పొత్తు ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. కానీ జనసేనను ఇరకాటంలోకి నెట్టేవిధంగా టిజి వెంకటేష్ ఆ పార్టీతో టిడిపికి పొత్తు ఉండబోతోందని కామెంట్స్ చేయడంతో పవన్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు.

 

జనసేన శ్రేణులను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నంలో భాగంగానే టిజి వెంకటేష్ చేత చంద్రబాబు కామెంట్స్ చేయిస్తున్నాడని పవన్ నిప్పులు చెరిగారు. కిడారి సోమ, సర్వేశ్వర్ రావు హత్యలకు కారణం చంద్రబాబే అని పవన్ మండిపడ్డారు.