Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కడపకు వెళ్ళనున్నారు. ఎంపీడీవో పై వైసిపి నేతలు దాడి చేయడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి ఎంపీడీవోను పరామర్శించడానికి పవన్ కడప బయలుదేరనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీ నేతలు అలాగే వైసిపి నాయకుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ దాడులను ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ నేత సుదర్శన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో భాగంగా ఎంపీడీవో జవహర్ బాబు తీవ్ర గాయాలు పాలయ్యారు ప్రస్తుతం ఈయన కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు..
ఇక ఈ విషయం తెలిసిన ఏపీ డిప్యూటీ సీఎం ఈ దాడికి పాల్పడిన వారి పట్ల చర్యలు తీసుకోవాలని ఆదేశించడమే కాకుండా బాధితులను పరామర్శించడానికి కడపకు వెళ్తున్నారు నేరుగా రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడు అయినటువంటి జవహర్ బాబుని పవన్ పరామర్శించబోతున్నారు. ఈ ఘటనను తీవ్రమైన విషయంగా భావించిన పవన్ కల్యాణ్ అధికారులకు అండగా నిలబడేందుకు అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.