పవన్ మాటతీరులో మార్పును గమనించారా.. చంద్రబాబుపై కూడా విమర్శలు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడిప్పుడే రాజకీయాలు అర్థమవుతున్నాయి. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయడం ఎంత పెద్ద తప్పు అనే విషయం పవన్ కు నెమ్మదిగా అర్థమవుతోంది. ప్రజారాజ్యం పార్టీ స్థాయిలో కూడా జనసేన ప్రూవ్ చేసుకోకపోవడం పవన్ ను ఎంతగానో బాధ పెడుతోంది. ఏ కారణాల వల్ల జనసేనకు నష్టం జరుగుతుందో పవన్ కు ఇప్పటికే అర్థమైందని తెలుస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ మాటతీరులో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అన్ని స్థానాలలో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని గతంలో మాట్లాడిన మాటలకు భిన్నమైన మాటలను పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇతర పార్టీల పేరు ఎత్తకుండా సొంతంగానే జనసేన పోటీ చేసే అవకాశం ఉందనే విధంగా పవన్ కళ్యాణ్ కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

చంద్రబాబుపై కూడా పవన్ కళ్యాణ్ పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. పవన్ ఆలోచనల్లో మార్పు వచ్చిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. అనుభవం పేరుతో గతంలో చంద్రబాబుకు అవకాశం ఇచ్చాననే విధంగా పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. పవన్ మాటల్లో వచ్చిన మార్పు అటు టీడీపీకి ఇటు బీజేపీకి భారీ స్థాయిలో నష్టం కలిగించే ఛాన్స్ అయితే ఉంది.

పవన్ కళ్యాణ్ త్వరలో 2024 ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ విధానంలో మార్పు రావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరింత కష్టపడితే 2024 ఎన్నికల్లో జనసేన మెరుగైన ఫలితాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.