జనసేన టికెట్ కోసం పవన్ కల్యాణ్ దరఖాస్తు

జనసేనాని పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తానని అంతా అనుకున్నారు. ఎందుకంటే, ఆయన రెండోమీటింగ్ అనంతపురం లో ఏర్పాటు చేసి, అక్కడి వెనకబడిన తనాన్నిపోగొట్టుందుకు, విప్లవకమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి స్పూర్తితో అనంతపురం నుంచి పోటీ చేస్తానని 2017లోనే పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయన అనంతపురం నుంచి పోటీ చేస్తారని 2017 నవంబర్ లో పార్టీ సీనియర్ నాయకుడు మహేందర్ రెడ్డి రాజమండ్రిలో ప్రకటించారు.

అయితే, ఆతర్వాత ఆయన అనంతపురం ప్రస్తావన తీసుకురాలేదు. తర్వాత తిరుపతి మీటింగ్ తర్వాత ఆయన అనంతపురం నుంచి కాదు, తిరుపతి పోటీ చేయవచ్చని వూహాగానాలుమొదలయ్యాయి. ఎందుకంటే, ఆయన చాలా సార్లు తన మొదటి రాజకీయ పార్టీ ‘ప్రజారాజ్యం’ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. ప్రజారాజ్యానికి ద్రోహం చేసిన వారిని వదలనని కూడా భీకర ప్రతిజ్ఞ కూడా చేశారు. ఆయన తిరుపతి లో భారీ మీటింగ్ పెట్టారు. దానికితోడుతిరుపతి తన అన్న చిరంజీవిని అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గం కూడా. అందువల్ల ఆ సంప్రదాయం కొనసాగించేందుకు పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. అనంతపురం కంటే తిరుపతి పవన్ అనుకూలమని, అక్కడ కాపు కుల వోట్లు బాగా ఉన్నాయని చెబుతారు. అందుకే తెలుగు దేశంపార్టీ కూడా ఒక సారి ఈ ప్రయోగం చేసింది. అపుడు మోహన్ అనే బిలిజ నాయకుడు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కాంగ్రెస్ కూడా వెంకటరమణ అనే వ్యక్తి టికెట్ ఇచ్చింది ఆయన కూడా గెలించారు. గెలుపు సులభమని, తర్వాత తిరుపతి తన శాశ్వత నియోజకవర్గం చేసుకోవచ్చని అనుకున్నారు.

అయితే,ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదుగాని, పార్టీ టికెట్ కోసం దరఖాస్తు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. జనసేన పార్టీ ప్రజాస్వామికంగా పనిచేస్తున్నదని చాటేందుకు ఈ మధ్యనే పార్టీ టికెట్ల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించేందుకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. తనకు టికెట్ కావాలని ఈ కమిటీకి సాధారణ ఔత్సాహికుడిగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే, స్క్రీనింగ్ కమిటీకి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న తొలి అభ్యర్థి ఆయనే అయ్యారు..  కేటాయింపులో స్క్రీనింగ్ కమిటీదే తుది నిర్ణయమని, అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ ఏదైనా కమిటీ సిఫార్సు మేరకే జరుగుతుందని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆయన ఎక్కడి నుంచి పోటీచేసేది ఇంకా గోప్యంగానే ఉంచారు.