మూడో భార్యకు కూడా విడాకులు ఇస్తున్న పవన్ కళ్యాణ్?

పవన్ కల్యాణ్ తన మూడో భార్య అన్నా లెజ్నోవా తో గతకొంతకాలంగా దూరంగా ఉంటున్నారని.. ప్రస్తుతం వారిద్దరూ విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నారని.. అయితే ఎన్నికలు అయ్యేవరకూ ఆమెను పవన్ రిక్వస్ట్ చేసి ఆపుతున్నారని కథనాలొస్తున్నాయి!! దీంతో ఈ ఊహాగాణాలు హాట్ టాపిక్ గా మారాయి.

పవన్ కల్యాణ్ కు అధికారికంగా ఇప్పటివరకూ రెండు విడాకులు అయ్యాయని అంటుంటారు. అయితే రేణూదేశాయ్ తో పవన్ ది వివాహ బంధం కాదు.. అది లివ్ ఇన్ రిలేషన్ వ్యవహారం కాబట్టి.. అది బ్రేక్ అప్ లెక్కల్లోకి వస్తుందే తప్ప విడాకుల లెక్కల్లోకి రాదనే వాదన కూడా ఉంది. ఇక పూనం కౌర్ రూపంలో వివాదాస్పదమైన వ్యవహారం ఒకటి నిత్యం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంటుంది!

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవా గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని చెబుతూ… ఆ గాసిప్ ను బలపరిచే కొన్ని విషయాలను ఉదహరించే ప్రయత్నం చేస్తున్నారు! ఇందులో భాగంగా… పవన్ మూడో భార్య అన్నా లెజ్నోవా… గతంలో కుటుంబ కార్యక్రమాలకు తప్పకుండా హాజరయ్యేదనే విషయం గుర్తుచేస్తున్నారు.

అవును… ఇటీవల జరిగిన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలో కానీ.. పవన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారాహి యాత్ర ప్రారంభానికి కానీ.. ఆ యాత్ర ప్రారంభానికి ముందు పవన్ చేసిన యాగానికి కాని ఆమె హాజరు కాలేదనే విషయాన్ని ప్రస్థావిస్తున్నారు.

కారణం… సాధారణంగా యాగాలు భార్యతో కలిసి నిర్వహిస్తారని చెప్పుకొస్తున్నారు! కానీ… అత్యంత ప్రతిష్టాత్మకమైన పనికోసం చేస్తున్న ఈ యాగంలో పవన్ ఒంటరిగా పాల్గొనడాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇదే సమయంలో మెగా ఫ్యామిలీలో మరో మనవరాలు వచ్చింది… ఆమె ఊయల ఫంక్షన్‌ లో కూడా పవన్ మూడో భార్య కనిపించలేదని అంటున్నారు. ఇంటి కోడలు అయ్యుండి ఇంత ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరుకాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వీటన్నింటినీ ఉదాహరణలుగా చూపిస్తున్న గాసిప్ రాయుళ్లు… పవన్ కళ్యాణ్ అతని మూడవ భార్యతో చట్టబద్ధంగా కాకపోయినప్పటికీ సామాజికంగా విడిపోయారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమె తన పిల్లలతో సింగపూర్ లేదా దుబాయ్‌ లో నివసిస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయని రాసుకొస్తున్నారు. కాదు కాదు ఆమె తన పిల్లలతో కలిసి తన స్వదేశమైన రష్యాకు వెళ్లిపోయిందని మరికొంతమంది చెబుతున్నారని తెలుస్తుంది!

మరి ఈ గాసిప్పుల్లో ఎంత నిజం ఉందనేది వేచి చూడాలి!

అయితే ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయం అనేది మాత్రం క్లియర్! కాకపోతే ప్రజాజీవితంలో ఉన్నారనే కారణంతోనో… తన స్టార్ హీరో కుటుంబ పరిస్థితి ఇప్పుడు ఎలాఉందనే కోట్ల మంది అభిమానుల ఆసక్తితోనో ఇలాంటి విషయాలు కూడా తెరపైకి వస్తుంటాయని అంటున్నారు! అయితే ఈ విషయం ఎన్నికలు అయ్యేవరకూ దాచి ఉంచాలనే ఆలోచనలోనే పార్టీ “పెద్దలు” ఆలోచిస్తున్నారని కూడా గాసిప్పులు రావడం గమనార్హం!!

అయితే ఇలాంటి గాసిప్పులు వస్తుండటంతో అభిమానుల్లోనూ, జనసేన కార్యకర్తల్లోనూ ఆందోళన నెలకొందని తెలుస్తోంది. ఫలితంగా.. వారంతా ఈ గాసిప్ సృష్టించినవారిపై ఆన్ లైన్ వేదికగా ఫైరవుతున్నారని అంటున్నారు!