జనసేన పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి జనసేన పార్టీ అధినేత జనసేన తరంగం అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జనసైనికులు ఇల్లిల్లూ తిరిగి ప్రతి ఇంటి తలుపుతట్టి ప్రతికుటుంబానికి జనసేన మ్యానిఫెస్టోలో ఏముందో వివరిస్తారు.
అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా చేపట్టారు. ఇలా ఇల్లిల్లూ తిరిగి మ్యానిఫెస్టోని కుటుంబ సభ్యులకు వివరించే పనిని గతంలో ఎవరూ చేపట్ట లేదు. అసలు పార్టీలకు మ్యానిఫెస్టోలుంటాయనే విషయమే చాలా మందికి తెలియదు. ఒక వేళ తెలిసినా వాటిని ఎవరూ చూసి ఉండరు. అంతెందుకు, ఎన్నికలపుడు విడుదల చేసే ఎన్నికల మ్యానిఫెస్టోలను ఏవో కొన్ని కాపీలు అచ్చుగుద్ది ప్రెస్ వాళ్లకు ఇవ్వడమే తప్ప ఇంటింటికి. ప్రతివోటరుకుఇవ్వాలన్న ధ్యాస పార్టీలకు లేదు. ఇపుడు ఇంటింటిరి మ్యానిఫెస్టో గురించి వివరించి, వాళ్లలో రాజకీయ చైతన్యం తీసుకురావాలనుకోవడం కొత్త వరవడి. రేపు ఇతర పార్టీలు వెళితే, మీ మ్యానిఫెస్టో ఏదీ అనియువకులు నిలదీసే పరిస్థితి కల్పిస్తున్నారు పవన్. ఇలా జనసేన తరంగం ఒక ఒక ప్రజలచేతిలో కొత్త ఆయుధం కానుంది.