జనసేనాని పవన్ పోటి చేసే స్థానం పై క్లారిటి

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పోటి చేసే స్థానం పై క్లారిటి వచ్చినట్టు తెలుస్తోంది., విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటి చేసే అవకాశాలున్నాయని సమాచారం. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

విశాఖ ఉత్తర అసెంబ్లీ నుంచి మంత్రి నారా లోకేష్ పోటి చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పవన్ కూడా విశాఖ జిల్లా నుంచే పోటి చేస్తుండడంతో జిల్లా వాసుల్లో ఆసక్తి నెలకొంది.