TG: అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ హోరాహోరీ పోరు సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి కాకుండా తమ సొంత ప్రయోజనాల గురించి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఏపీని టార్గెట్ చేస్తూ అమరావతి గురించి ఎన్టీఆర్ ఘాట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల మంత్రి పొంగులేటి అమరావతిలో వచ్చిన వరదలు చూసి ఇన్వెస్టర్లు ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రాలేదని అమరావతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఘాటు గురించి తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి డియాతో చిట్ చాట్ లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ గాట్ గురించి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాదులో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ లేపేసి అక్కడ కొత్త అసెంబ్లీ భవనం కడితే బాగుంటుందనీ తెలిపారు.తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ భవనం చాలా ఓల్డ్ ది అని.. సచివాలయం కొత్తది అని తెలిపారు. సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కన ఉంటే పరిపాలనకు చాలా సులభంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేశారని ఎవరికైనా స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఈ వ్యాఖ్యలపై టిడిపి కార్యకర్తలు, ఎన్టీఆర్ స్పందిస్తూ తమదైన శైలిలోనే వార్నింగ్ ఇస్తున్నారు.
ఎన్టీఆర్ ఘాట్ లేపేసే ఆలోచన వెనుక ఎవరున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఎన్టీఆర్ ఘాట్ ను టచ్ చేసి చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయో అంటూ ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సీరియస్ అవుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
• అమరావతి నభూతో నభవిష్యత్ గా అభివృద్ది చెందబోతుందనేది సత్యం
• చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నాందిపలికాయి
• తెలంగాణా రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ వ్యాఖ్యలు హాస్యాస్పదం మరియు ఉద్దేశ్యపూర్వకం
• జగన్ మోహన్… pic.twitter.com/lpmJaKn5hK
— Dhulipalla Narendra Kumar (@DhulipallaNk) December 17, 2024