జనసేన ఎలూరు లోక్ సభ అభ్యర్థి ఆర్థిక వేత్త డా. పెంటపాటి పుల్లారావు

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఆర్థిక వేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు ను ఎలూరు లోక్ సభ అభ్యర్థి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. శనివరాం రాత్రి పార్టీ కార్యాలయంలో పుల్లారావు అభ్యర్థిత్వానికి ఆయన ఖరారు చేశారు. ఈ మేరకు జనసేన నేతను అభినందించాల్సిందే . ఎందుకంటే, చాలా ప్రతిష్టాత్మకమయిన ఏలూరు సీటును డబ్బుసంచులుతో కొనడానికి బలిసినవాళ్ల క్యగట్టే అవకాశం ఉన్న ఏలూరు స్థానాన్ని కలం, కంఠం తప్ప మరొకటి ఏమీ లేని డాక్టర్ పుల్లారావుకు కేటాయించడం సాహసం తో కూడిన నిర్ణయం. అందుకే పవన్ ని అభినందించాలి. డాక్టర్ పుల్లారావు ‘తెలుగు రాజ్యం’ కు కూడా ప్రత్యేక వ్యాసాలు రాశారు.

లోక్ సభసీటు కావాలంటే నలభై కోట్లున్నాయా అని ప్రముఖ పార్టీలన్నీ అశావహులను ప్రశ్నిస్తున్నాయి. అలాంటపుడు పోలవరం నిర్వాసితులకోసం పోరాడి, ఉన్నడబ్బులన్నీ పొగొట్టుకున్న పుల్లరావును  ఎలూరు సీటుకు ఎంపిక చేయడం పవన్ చేస్తున్న ఒక గొప్ప ప్రయోగం.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పుల్లారావు ను ఎలూరు లోక్ సభ స్థానానికి ఎందుకు ఎంపిక చేశారో వివరించారు.

‘ఆయన గిరిజనుల సమస్యల పైన, పర్యావరణపరిరక్షణ కోసం పోరాటాలు, బాధితులకు అండగా నిలిచిన తీరు నన్ను ఆకట్టుకున్నాయి. ఆయన సేవలు దేశానికి చాలా అవసరం. ఇలాంటి ఉన్నతమయిన వ్యక్తులు పార్లమెంటుకు వెళ్లాలి.రు. 50 కోట్లు పెట్టి ఎంపిలు అయిపోదామని వచ్చే వారు కాదు, విలువలతో కూడివ విజయం సాధించిన వ్యక్తులు పార్లమెంటుకు వెళ్లాలని చిన్ననాటి నుంచిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి విలువులకలిగిన వ్యక్తి పెంటపాటి పుల్లారావు. సీనియర్ ఏకానమిస్టు, చిన్న నాటి నుంచి విదేశాలలో చదువుకున్నా , దేశీ య సంస్కృతి, కట్టుబాట్లు ఆచార వ్యవహారాల మీద ఆపారమయిన గౌరవం ఉన్న వ్యక్తి. ఆయన రాసిన అర్టికిల్స్ దేశ విదేశాల్ల్ ప్రచరితం అవుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా సంవత్సరాలుగా నా దృష్టికి వస్తున్నాయి. అందుకే ముందుగా వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా మన్నించి పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు. ఇపుడు నా అభ్యర్థనను అర్థం చేసరుకుని జనసేన పార్టీ తరఫున ఏలూరు లోక్ సభ స్థానం నుంచి నిలబడటానికి అంగీకరించారు. దానికి మరొక ధన్య వాదాలు చెబుతున్నాను. పోలవరం బాధితులకు అండగా నిలిచిన మీ విజయం పోలవరం బాదితుల విజయం. మీ విజయం సగటు మధ్య తరగతి విజయం. మీలాంటి రాజకీయ విలువలు ఉన్రన వ్యక్తులు పార్లమెంటు వెళ్లాలి,’ అని పవన్ అన్నారు.

డాక్టర పెంటపాటి పుల్లారావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలనుంచి రాజకీయాలని చూస్తున్నా, రైతుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసిన మొదటి రాజకీయ పార్టీ జనసేన. 2013లో భూసేకరణ చట్టం అమలుతో పాటు మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా ముందుకు వెళ్తన్న పార్టీ జనసేన ఇలాంటి విధానాలు మార్పుని తీసుకువస్తాయి. అలాంటి పార్టీ నాలాంటి వ్యక్తికి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. జనసేన పార్టీ తప్పకుండా దేశ రాజకీయాల్లో ఒక కొత్త పంధాని తీసుకు వస్తుందన్న నమ్మకం నాకుంది, అని అన్నారు.