నిమ్మగడ్డ కడప జిల్లా పర్యటన వాయిదా .. అసలు కారణం ఇదే !

ap cec nimmagadda speaks on ap panchayat elections

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. తాజాగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కంటి ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆయన ఐ టెస్ట్ చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈనాటి కడప జిల్లా పర్యటనను ఆయన వాయిదా వేసుకున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ రేపు జరగనుంది.

ap volunteers should not participate in panchayat elections tdp alleges
ap 

ఈ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఉద్యోగ సంఘాల నేతలు సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరుగుతున్నాయి.

మరోవైపు ఏకగ్రీవాలకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఏకగ్రీవాలు జరిగితే ప్రోత్సాహకాలను ఇస్తామని ప్రభుత్వం చెపుతోంది. ఏకగ్రీవాలు బలవంతంగా జరగకుండా చూడాలని నిమ్మగడ్డ అధికారులకు సూచిస్తున్నారు. రేపు పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జరగబోతోంది. ఈ సమయంలో ఏర్పాట్లను సమీక్షిస్తున్న నిమ్మగడ్డ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనపై కోర్టుల్లో సైతం పోరాటం చేస్తున్నారు. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి కూడా గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నా లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న నిమ్మగడ్డ రమేష్.. అధికారుల నుంచి మాత్రం సహకారం లభిస్తుందని తాజాగా వెల్లడించారు.