చిరంజీవికి పవన్ వెన్నుపోటు పొడిచారా.. ఇలాంటి కామెంట్లు అవసరమా నాని?

AP Minister Perni Nani

ఈ మధ్య కాలంలో రాజకీయ నేతల విమర్శలు హద్దులు దాటుతున్నాయి. చాలామంది రాజకీయ నేతలు వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి పేర్ని నాని చిరంజీవికి పవన్ వెన్నుపోటు పొడిచారంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రి పేర్ని నాని చిరంజీవికి, పవన్ కు పొంతన లేదని చిరంజీవి పార్టీ పెట్టి పోరాటం చేశారని చెప్పుకొచ్చారు.

చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా పోరాటం చేశారని ఆ పార్టీ ద్వారా 18 సీట్లలో విజయం సాధించారని ఆయన తెలిపారు. చిరంజీవి పొలిటికల్ గా తప్పులు చేసిన విధంగా పవన్ మాట్లాడుతున్నారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. పవన్ తాను పునీతుడనేలా మాట్లాడుతున్నారని పేర్ని నాని కామెంట్లు చేశారు. పవన్ చేసిన స్థాయిలో చిరంజీవి తప్పులు చేయలేదని పేర్ని నాని వెల్లడించడం గమనార్హం.

ప్రజారాజ్యంను పవన్ ఎందుకు ఎందుకు వదిలేశారని ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాత పవన్ మళ్లీ కనిపించలేదని నాని కామెంట్లు చేశారు. చిరంజీవి దయతో పవన్ ఈ స్థాయికి వచ్చి ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని నాని అన్నారు. 2009లో పవన్ చంద్రబాబు నాయుడును తప్పుబట్టారని కానీ 2014లో చంద్రబాబుకు ఓటు వేయాలని ఆయన సూచించారని నాని చెప్పుకొచ్చారు.

అయితే చిరంజీవి పేరును వినియోగించుకుని వైసీపీ నేతలు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. వైసీపీ నేతలు ఈ విధంగా చేయడం వల్లే వైసీపీ నేతల వ్యక్తిగత జీవితాలను సైతం టార్గెట్ చేయడం జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ నేతల కామెంట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.