వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కు.. మరీ టీడీపీ సంగతేంటి బాబు?

NCBN

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏమిటో చంద్రబాబుకు బాగా తెలుసు. 2024 ఎన్నికలలో వైసీపీ ఒక్క సీటులో కూడా గెలవదని చంద్రబాబు నాయుడు చెబుతుండటం గమనార్హం. వైసీపీ ఏమని ఓట్లు అడుగుతుందని బాబాయిని చంపామనా కోడి కత్తి డ్రామా ఆడామనా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కుప్పంలో జరిగిన మూడురోజుల పర్యటనలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ కామెంట్లు చేశారు.

టీడీపీ తీవ్రవాదులు, నక్సలైట్లపై పోరాటం చేసిందని వైసీపీ ఊరికో రౌడీని తయారు చేస్తోందని చంద్రబాబు కామెంట్లు చేశారు. తాను రౌడీలకు రౌడీనని వారికి భయపడేవాడిని కాదని వెల్లడించారు. వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కు అని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పులివెందులలోనే వైసీపీని సమాధి చేస్తానంటూ చంద్రబాబు కామెంట్లు చేయడం గమనార్హం.

వైసీపీ గురించి టీడీపీ ఆరోపణలు సరేనని మరి టీడిపీ సంగతేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ప్రస్తుతం గొప్పగా ఏమీ లేదు. రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవడం కూడా కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా చేసిందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీపై విమర్శలు చేయడం తప్ప టీడీపీ సాధించిందేమీ లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

టీడీపీ ప్రజలకు మంచి చేసే నిర్ణయాలను తీసుకోకుండా అధికార పార్టీపై విమర్శలకు పరిమితమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు పదేపదే ఒకే తరహా విమర్శలు చేస్తున్నారని కూడా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నెటిజన్లు చేస్తున్న కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.