ఇతర స్టార్ హీరోలకు లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఊహించని స్థాయిలో వీరాభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ బలం, బలహీనత రెండూ అభిమానులే కావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ అభిమానులు పలు సందర్భాలలో చేసిన సేవా కార్యక్రమాల వల్ల పవన్ కు మంచి పేరు వచ్చింది. అదే సమయంలో ఇతర హీరోల సినిమాల ఈవెంట్లలో పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చ వల్ల ఆయనపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన చెప్పిన ప్రతి మాటను వేదంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం కావాలని నిస్వార్థంగా పని చేస్తున్న జనసైనికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం పవన్ పరువు పోవడానికి కారణం కావడంతో పాటు ఇతర హీరోలకు పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ ఒపీనియన్ కలగడానికి కారణమవుతున్నారు. కొందరు ఫ్యాన్స్ పవన్ ఇమేజ్ కు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు.
కర్నూలులోని ప్రముఖ థియేటర్ పై పవన్ ఫ్యాన్స్ రాళ్ల దాడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జల్సా సినిమా ప్రదర్శితమవుతున్న పలు థియేటర్లలో స్క్రీన్ దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేస్తూ సినిమా చూడాలనుకునే అభిమానులకు ఇబ్బందులను క్రియేట్ చేశారు. పవన్ మాత్రమే ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయగలరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హద్దులు దాటి ప్రవర్తిస్తున్న అభిమానులను పవన్ సున్నితంగానైనా హెచ్చరించాల్సిన అవసరం ఉంది. అభిమానం హద్దులు దాటితే నష్టమే తప్ప లాభం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులను నమ్ముకుని పాలిటిక్స్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ తప్పుగా ఏం చేసినా ఆ ఎఫెక్ట్ పవన్ పై పడుతుందనే సంగతి తెలిసిందే. థియేటర్లపై దాడుల గురించి పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.