మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు. అయితే రాజకీయాలలో మాత్రం చిరంజీవి సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే. ఇతర పార్టీల నేతలపై ఘాటుగా విమర్శలు చేయకపోవడం కూడా చిరంజీవి రాజకీయాలలో సక్సెస్ కాకపోవడానికి కారణమని చాలామంది భావిస్తున్నారు. అందరివాడు అనిపించుకోవాలని భావించే చిరంజీవి ఆ ప్రయత్నంలో కొంతమందికి మాత్రం దూరమవుతున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ చిరంజీవికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి కోరిన వెంటనే సీఎం జగన్ ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా భీమవరంలో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ చిరంజీవిని సోదరుడని సంబోధించారు. అయితే 2024 ఎన్నికల సమయంలో జగన్ చిరంజీవితో వైసీపీకి ప్రచారం చేయించాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే చిరంజీవి వైసీపీ తరపున ప్రచారం చేస్తే మాత్రం పవన్ ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేరని చెప్పవచ్చు. చిరంజీవి వైసీపీ తరపున ప్రచారం చేయని పక్షంలో భవిష్యత్తులో జగన్ సర్కార్ అధికారంలోకి వస్తే జగన్ సర్కార్ నుంచి చిరంజీవికి సహాయసహకారాలు ఉండవు. చిరంజీవి జనసేన తరపున కాకుండా మరో పార్టీ తరపున ప్రచారం చేస్తే తమ్ముడికి ద్రోహం చేసినట్టేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చిరంజీవి మాత్రం రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండాలని భావిస్తున్నారని తెలుస్తోంది. 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వేగంగా సినిమాలలో నటించి ఆ తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆయన భావిస్తున్నారని సమాచారం అందుతోంది. సినిమాసినిమాకు చిరంజీవి రేంజ్, మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా స్టార్ డైరెక్టర్లకు చిరంజీవి వరుసగా ఛాన్స్ లు ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి పారితోషికం 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.