జనసేన పార్టీ ఎందుకు పవన్.. టీడీపీలో చేరితే సరిపోతుంది కదా?

Pawan-kalyan-1

ఏ రాష్ట్రంలో అయినా వేర్వేరు రాజకీయ పార్టీలు ఉండటం వల్ల ప్రయోజనం ఏంటనే ప్రశ్నకు వేర్వేరు ప్రయోజనాలు కలుగుతాయని సమాధానం వినిపిస్తుంది. అయితే ఏపీలో టీడీపీ, జనసేన రెండు వేర్వేరు పార్టీలు అయినా ఈ రెండు పార్టీలు ఒకటే అని చాలామందిలో అభిప్రాయం ఉంది. టీడీపీకి ప్రయోజనం చేకూర్చడం కోసమే జనసేన అని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక పార్టీ అవసరం ఏముందని జనసేనను టీడీపీలో విలీనం చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మరి కొందరు పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరితే సరిపోతుంది కదా అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన రెండు వేర్వేరు పార్టీలు ఉండటం వల్ల ప్రయోజనం ఏంటని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

టీడీపీలో పవన్ కళ్యాణ్ కొనసాగితే చంద్రబాబు తర్వాతే ఆయనే సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ వల్ల సామాన్య ప్రజలకు కలిగిన లాభం ఎంత మాత్రం లేదు. కౌలు రైతులకు సహాయం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించినా ఆ సహాయం ఏ స్థాయి సహాయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మరి కొందరు వెల్లడిస్తున్నారు.

టీడీపీ, జనసేన పార్టీలు ఏపీ ప్రజలకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. ఏపీకి అభివృద్ధి జరగకుండా ఈ రెండు పార్టీలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.