నిజంగానే ముద్రగడ పద్మనాభం ఆ లేఖ రాశారా.? లేఖ రాయాల్సిన అవసరమేముంది.? సాక్షి న్యూస్ ఛానల్‌కి వచ్చి, చెప్పాలనుకున్నవేవో చెప్పెయ్యొచ్చు కదా.? మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంటేనే, లేఖలకి ప్రసిద్ధి.!
కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభంకి గుర్తింపు వుంది. కానీ, ఒకప్పటి ముద్రగడ పద్మనాభం వేరు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వేరు. కాపు సామాజిక వర్గంలో ఈక్వేషన్స్ చాలా చాలా మారిపోయాయ్.
టీడీపీ హయాంలో కాపు ఉద్యమాన్ని రెచ్చగొట్టి, కాపు యువతని కేసుల్లో ఇరికించిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభంపై కాపు సమాజంలో చాలా చాలా వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. అది చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడ. వైసీపీ పాపం కూడా ఇందులో లేకపోలేదు.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మండిపడుతూ ముద్రగడ పద్మనాభం లేఖ రాయడాన్ని కాపు సమాజం అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. పైగా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వెనకేసుకొస్తూ ఆయన లేఖ రాయడమే తేడా కొట్టింది.
అదే లేఖ మాజీ మంత్రి కన్నబాబు ప్రస్తావనతోనో, అంబటి రాంబాబు ప్రస్తావనతోనో వచ్చి వుంటే, ఈక్వేషన్ ఇంకోలా వుండేది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాని ‘వారాహి యాత్ర’ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్లో.. ఇది అత్యంత కీలకమైనది.
నిప్పు రాజేశారు.. కానీ, వ్యూహం బెడిసికొట్టింది. జనసేనకు అది అడ్వాంటేజ్ అయి కూర్చుంది.!