హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా చెప్పబడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. అత్యంత అసభ్యకరంగా వుంది ఆ వీడియో. ఓ మహిళతో న్యూడ్‌గా గోరంట్ల మాధవ్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ వీడియో షేర్ అయ్యింది.
అయితే, అది ఫేక్ వీడియో అంటున్నారు ఎంపీ గోరంట్ల మాధవ్. తన మీద ఎవరో కుట్ర పూరితంగా ఈ మార్ఫింగ్ వీడియోని రూపొందించారన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపణ. తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచీ తన మీద దుష్ప్రచారం జరుగుతూనే వుందనీ, ఎంపీ అయ్యాక అది మరింత పెరిగిందనీ గోరంట్ల మాధవ్ చెప్పారు.
ఫేక్ వీడియోపై ఫిర్యాదు చేస్తాననీ, నిజాలు నిగ్గు తేలాల్సిందేనని వైసీపీ నేత, లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ చెబుతున్నారు. అయితే, ఆ వీడియో ఫేక్ కాదు.. రియల్ అంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వైసీపీ నుంచి తక్షణమే గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేయాలనీ, ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయాలంటూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ నేతలు అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు తదితరులకు సంబంధించి ఆడియో లీకులు బయటకు వచ్చాయి. అయితే, వాటిని ఫేక్ ఆడియో టేపులుగా అప్పట్లో ఆ నాయకులు కొట్టి పారేశారు. ఇప్పుడు ఏకంగా వీడియో టేపు బయటకు వచ్చింది.. అదీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ది. వీడియో చూస్తే మార్ఫింగ్ ఆనవాళ్ళు అస్సలు తెలియడంలేదు.
నిజానికి, చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమిది. లోక్ సభ సభ్యుడిగా తనకున్న అవకాశాల మేరకు ఆయన ఈ వీడియోపై చర్యలు తీసుకోగలుగుతారా.? లేదంటే, విపక్షాల దుష్ప్రచారం.. అని ఎదురుదాడికి దిగి ఊరుకుంటారా.? అన్నది వేచి చూడాల్సిందే.