TG: జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి.. సీరియస్ అయినా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

TG: సినీ ఇండస్ట్రీలోని ఇటు రాజకీయాల పరంగా కూడా మంచు మోహన్ బాబు వ్యవహారం సంచలనంగా మారింది. ఈయన ఇంట్లో చోటు చేసుకున్న గొడవలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి ప్రతి నిమిషం ఈ ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా గత రాత్రి మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేసిన ఘటన సంచలనం రేపుతుంది.

ఇలా జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు మైకుతో దాడి చేయడంతో ఆయనకు తీవ్రమైన గాయం తగిలిందని చెవికి కంటి మధ్య భాగంలో లోపల మూడు చోట్ల ఫ్యాక్చర్ అయినట్లు వైద్యులు తెలియజేశారు ఈ గాయానికి చికిత్స చేయడం కుదరదని తప్పనిసరిగా ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు వెల్లడించారు. ఇలా జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేయడానికి జర్నలిస్టు సంఘాలు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నాయి.

ఇలా జర్నలిస్టుకు ఈ స్థాయిలో గాయం తగిలిందంటే మోహన్ బాబు ఎంత గట్టిగా కొట్టి ఉంటారు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు అలాగే రాజకీయ నాయకులు కూడా స్పందించారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేస్తున్న ఘటనలు చట్టం తన పని తాను చేసుకోబోతుందని ఈయన తెలియజేశారు. అనంతరం ఈయన జర్నలిస్ట్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. మోహన్ బాబుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలకు పిలుపునిచ్చారు. తక్షణమే మోహన్ బాబు క్షమాపణ చెప్పకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.