మోదీ సర్కార్ సూపర్ స్కీమ్.. రూ.12 కడితే రూ.2 లక్షలు పొందే ఛాన్స్!

Modi

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలలో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా తక్కువ ప్రీమియంతోనే 2 లక్షల రూపాయల బీమా పొందే అవకాశం అయితే ఉంటుందనే సంగతి తెలిసిందే. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా ఈ స్కీమ్ అమలవుతోంది. కేవలం 12 రూపాయలు చెల్లించి ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రమాదంలో అంగ వైకల్యం సంభవిస్తే శాశ్వత అంగవైకల్యానికి 2 లక్షల రూపాయలు, పాక్షికంగా అంగ వైకల్యానికి లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుంది. 70 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హతను కలిగి ఉంటారు.

ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వాళ్ల బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు డెబిట్ కావడం జరుగుతుంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉండాలంటే ఖాతాలో తగినంత డబ్బు ఉండాలి. ఎక్కువ సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు ఉన్నవాళ్లు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసుకుంటే సరిపోతుంది.

https://www.dif.mp.gov.in/pmjsby.htm వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బీమా ఏజెంట్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ స్కీమ్ లను అమలు చేస్తున్నాయి.