చిరంజీవికి కొడాలి నాని కౌంటర్… గట్టిగానే ఇచ్చారు బ్రో!

చిరంజీవి “వాల్తేరు వీరయ్య” 200 రోజుల ఫంక్షన్‌ లో పరోక్షంగా ప్రత్యక్షంగా వైసీపీ ప్రభుత్వంపైనా, పరోక్షంగా అంబటి రాంబాబు పైనా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. అయితే చిరంజీవి చేసిన ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు.

ఏపీ ప్రభుత్వంపైనా, మంత్రి అంబటి రాంబాబుపైనా చిరంజీవి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. పేరు ఎత్తకుండానే గట్టిగా రిటార్ట్ ఇచ్చారు. డిఫెన్స్ ఆడటం పై ఏమాత్రం ఆసక్తి కనబరచని కొడాలి నాని… చిరు వ్యాఖ్యలపై ఎఫెన్స్ మోడ్ లోనే సమాధానం చెప్పారు.

అవును… మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలకు మాజీమంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు ఉన్నారని.. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవతలివారికి కూడా “ప్రభుత్వం గురించి మనకెందుకు” అని సలహాలు ఇవ్వొచ్చు కదా అని సూచించారు.

మనం డాన్స్‌ లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా.. అని చిరుకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని. ఈ విషయంలో అందరూ… ఆ ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. దీంతో అన్నాతమ్ముళ్లిద్దరికీ కొడాలి ఒకేసారి ఇచ్చేశారని అంటున్నారు పరిశీలకులు.

కాగా… “నటీనటుల పారితోషకాల గురించి మీ కెందుకు.. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదల కడుపునింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవం” అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా.. “బ్రో” సినిమాలో తనని ఉద్దేశించి ఒక సన్నివేశం జోడించారని మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకపడిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన పవన్ తన పారితోషికం వివరాల్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. రోజుకి రెండు కోట్లు తన పారితోషకం అని ఒక రాజకీయ వేదికపై స్పందించిన పవన్.. ఈ సినిమాకి ఎంత తీసుకున్నారో చెప్పాలని అన్నారు.

తన బ్రో సినిమా పారితోషికం చెప్పలేని వాడు, రాజకీయాల్లో పారదర్శకంగా ఎలా ఉంటాడని నిలదీశారు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌ గానే చిరంజీవిపై విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో.. కొడాలి నాని ఆ వెంటనే రంగంలోకి దిగి, చిరంజీవి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.