మెగాస్టార్ చిరంజీవి అసలు రాజకీయాల్లోకే రాను అనే స్టేట్ మెంట్ ఇచ్చారు కదా.. మళ్లీ బీజేపీలో ఎలా చేరుతున్నారు అనే ప్రశ్న ఎదురవుతుంది కదా. అయితే… త్వరలో ఏపీలో తిరుపతి ఉపఎన్నిక జరగనుంది కదా.. దానికోసమే ఈ స్టంట్స్ అన్ని. ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ తిరుపతి ఉపఎన్నికపై దృష్టి సారించాయి. చివరకు బీజేపీ కూడా. బీజేపీ ఈ సారి తిరుపతి ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసమే.. తిరుపతి ఉపఎన్నికను చిరంజీవితో ప్రచారం చేయించాలని భావిస్తోంది.
చిరంజీవి ఇప్పటికే తిరుపతిలో గెలిచారు. ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు అక్కడ మద్దతు బాగానే ఉన్నది. అలాగే కాపు సామాజికవర్గం ఓటర్లంతా చిరంజీవికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాపులను తమవైపునకు తిప్పుకోవాలంటే.. చిరంజీవిని బరిలోకి దించాలని బీజేపీ యోచిస్తోందట. ఇప్పటికే చిరంజీవితో దీనిపై చర్చలు కూడా జరిపారట బీజేపీ పెద్దలు.
ఒకవేళ చిరంజీవికి ఇంట్రెస్ట్ ఉంటే.. బీజేపీలో చేర్పించుకోవడానికి కూడా బీజేపీ రెడీగా ఉందట. బీజేపీ తిరుపతిలో గెలవాలంటే.. ఖచ్చితంగా చిరంజీవి లాంటి దీటైన వ్యక్తి ఉండాలని.. ఎలాగూ.. జనసేన, బీజేపీ ప్రస్తుతం ఒకటే కాబట్టి.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నే చిరంజీవి కావడంతో… చిరంజీవితో తిరుపతిలో ప్రచారం చేయించాలని బీజేపీ ఉబలాటపడుతోంది. కానీ.. అసలు.. చిరంజీవి దీనికి ఒప్పుకుంటారా? తిరుపతి ఉపఎన్నికల్లో ఆయన బీజేపీ తరుపున ప్రచారం నిర్వహిస్తారా? అనేది పెద్ద ప్రశ్నే.