మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఉన్నారా? లేరా? అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది చిరంజీవి రాజకీయాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నారని భావిస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి రాజకీయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో జోక్యం చేసుకోనని ఆయన అన్నారు. పవన్ కు పరోక్షంగా మాత్రం సపోర్ట్ ఉంటుందని చిరంజీవి కామెంట్లు చేశారు.
పవన్ జనసేన పార్టీకి డైరెక్ట్ గా మాత్రం తన మద్దతు ఉండదని చిరంజీవి చెప్పేశారు. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో చిరంజీవి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి పవన్ కళ్యాణ్ తన బిడ్డలాంటి వ్యక్తి అని కామెంట్లు చేశారు. పవన్ పై, తనపై విమర్శలు చేసేవాళ్లకు ఆ విమర్శల విషయంలో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
చిరంజీవి ప్రస్తుతం వేగంగా సినిమాల్లో నటిస్తుండగా ఏ పార్టీతో తనకు శత్రుత్వం వద్దనే ఆలోచనతో ముందుకు వెళుతున్నారని సమాచారం అందుతోంది. వైసీపీపై చిరంజీవి కూడా విమర్శలు చేస్తూ ఆ విమర్శలు పరిపాలనపై మాత్రం కాదు. జగన్ కు అనుకూలంగా చిరంజీవి వ్యవహరించడం వల్లే వాల్తేరు వీరయ్య మూవీకి టికెట్ రేట్ల పెంపు జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే చిరంజీవి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదని బోగట్టా. చిరంజీవి రాజకీయాల్లో సంచలనాలు సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. చిరంజీవి రాజకీయాలలో సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.