కేసిఆర్ ఫ్యామిలీకి చంచల్ గూడ జైలు తప్పదు (వీడియో)

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం నిధుల దుర్వినియోగానికి మాత్రమే చేపడుతున్నారని ఆరోపించారు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం. కాంట్రాక్టర్లను మేపడానికి, వారిచ్చే కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని విమర్శించారు. ప్రజల భూములు గుంజుకుంటూ ప్రజలను తప్పుదోవపట్టించేలా మాట్లాడుతున్న టిఆర్ఎస్ అధినాయకులకు చెంచల్ గూడ జైలు తప్పదని హెచ్చరించారు కోదండరాం. కోదండరాం మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

తమ్మిడి హట్టి దగ్గర కన్నా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర బ్యారేజీలు కట్టుకుంటూ పోయి వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నరని ఆరోపించారు. తమ్మిడి హట్టి దగ్గర కంటే మేడిగడ్డ డగగర ఎక్కువగా నీటి లభ్యత ఉండే అవకాశమే లేదన్నారు. మేడిగడ్డ వద్ద మధ్య గోదావరి, మానేరు, ఆదిలాబాద్ వాగులు వంకలు తప్ప వేరే నీళ్లు వచ్చే అవకాశం లేదన్నారు. ప్రాణహిత నది 95 శాతం ఉత్తరాదినే ఉంటది కాబట్టి కింద చాలా తక్కువ ప్రవాహం ఉంటదన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు, పెద్ద పెద్ద కమిషన్లు అన్నదే టిఆర్ఎస్ సర్కారు లక్ష్యంగా కనబడుతున్నదని విమర్శించారు.