లోకేషా.! అట్లుంటది కొడాలి నానితో యవ్వారం.!

‘మన తల్లిని తిడతారా.?’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తీవ్రస్థాయిలో మాజీ మంత్రి కొడాలి నాని మీద విరుచుకుపడిపోయారు. నారా లోకేష్ పుట్టుక మీద వైసీపీలో చాలామంది నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. ‘చంద్రబాబు పోలికల్లేవ్.. ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా పని చేసిన ఎలిమినేటి మాధవరెడ్డి పోలికలున్నాయ్..’ అంటూ లోకేష్‌ని వైసీపీ నేతలు ర్యాగింగ్ చేయడం చూస్తూనే వున్నాం.

ఇది లోకేష్‌ని అవమానించినట్టు కాదు.. ఆయన తల్లిని అవమానించినట్లే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. రాజకీయాలు ఏనాడో దిగజారిపోయాయ్. తప్పు అందరిదీ.! టీడీపీ నేతలు తక్కువేం తిన్లేదు, వైఎస్ జగన్‌కి సూరీడు పోలికలున్నాయ్.. అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెనుకాల ‘నీడలా’ వుండే సూరీడు పేరుని ప్రస్తావిస్తూ వచ్చారు.

కుక్క కాటుకి చెప్పుదెబ్బ.. అన్నట్టు, టీడీపీ పైత్యానికి, వైసీపీ విరుగుడు మంత్రం.. అనుకోవాలా.? అలా సరిపెట్టుకోగలమా.?
ఇక, తన మీద లోకేష్ చేసిన చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలకు కొడాలి నాని గట్టిగానే సమాధానమిచ్చారు. ‘స్ట్రెయిట్‌గా వచ్చెయ్.. నీ దమ్మెంతో, నా దమ్మెంతో చూసుకుందాం..’ అంటూ లోకేష్‌కి సవాల్ విసిరారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేననీ, లోకేష్ విదేశాలకు పారిపోకుండా జాగ్రత్త పడాలనీ కొడాలి నాని అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ గెలిచి, అధికారంలోకి వచ్చాక కొడాలి నానిని, కట్ డ్రాయర్ మీద రోడ్డుపై నిలబెడతానని లోకేష్ వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.

కాగా, ఎలక్షన్ అఫిడవిట్‌లో విద్యార్హత విషయమై ఒక్కోసారి ఒక్కోలా పేర్కంటాను.. అది నా ఇష్టం.. నువ్వేమైనా ఎలక్షన్ కమిషన్‌వా.? అని కొడాలి నాని, టీడీపీని ప్రశ్నించడం వివాదాస్పదమవుతోంది.