జగన్ పై జరిగిన దాడి గురించి పలు విమర్శలు చేస్తూ ఏపీ సీఎం తనయుడు నారా లోకేష్ అనేక ట్వీట్లు పెట్టారు. వైసీపీ కోడి కత్తి డ్రామా చేస్తుందని ఎద్దేవా చేసారు. జగన్ ని జగన్ మోడీ రెడ్డిగా పిలుస్తూ దాడిపై అనేక ఆరోపణలు చేసారు. అయితే లోకేష్ చేసిన ఈ ట్వీట్స్ కు గుడివాడ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ట్విట్టర్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు. కింద ఆ ట్వీట్స్ వివరాలు ఉన్నాయి చదవండి.
నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక, నాన్నారు నామినేట్ చేస్తే ఎమ్మెల్సీగా మంత్రి అయిన నువ్వు గెలుపు-ఓటముల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అధికారం కోసం పొత్తులు, అవసరం తీరాక నిందలు వేయటం మీకు ఏమాత్రం కొత్త కాదు. రాష్ట్ర ప్రజలను మరోసారి మభ్యపెట్టొచ్చు అనుకోవడం మీ మూర్ఖత్వం. #షేమ్ లెస్ టీడీపీ
నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేక, నాన్నారు నామినేట్ చేస్తే MLCగా మంత్రి అయిన నువ్వు గెలుపు-ఓటముల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అధికారంకోసం పొత్తులు,అవసరం తీరాక నిందలు వేయటం మీకు ఏమాత్రం కొత్తకాదు. రాష్ట్రప్రజలను మరోసారి మభ్య పెట్టొచ్చు అనుకోవడం మీ మూర్ఖత్వం #ShamelessTDP https://t.co/ky0DKW5Olp
— Kodali Nani (@IamKodaliNani) October 27, 2018
అధికారం కోసం ఎలాంటి నీచమైన పనులు అయినా చేయవచ్చు అని పోటీ పెడితే మీ బాబును కొట్టేవాడు ప్రపంచంలోనే ఎవడూ లేడు. వెన్నుపోటుకి పర్యాయపదం మీ బాబు నలభయ్యేళ్ళ చరిత్ర. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందిరా లోకేశా.. #షేమ్ లెస్ టీడీపీ
అధికారం కోసం ఎలాంటి నీచమైన పనులు అయినా చేయవచ్చు అని పోటీ పెడితే మీ బాబుని కొట్టే వాడు ప్రపంచంలోనే ఎవడూ లేడు. వెన్నుపోటుకి పర్యాయపదం నీ బాబు 40 ఏళ్ల చరిత్ర. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమకంతా పచ్చ గానే కనిపిస్తుందిరా లోకేశా.. #ShamelessTDP https://t.co/ClMBTpqDZA
— Kodali Nani (@IamKodaliNani) October 27, 2018
ఆశ్చరం కాదురా లోకేశా..ఆశ్చర్యం అనాలి
ఈ పకోడీ ట్వీట్లు మానేసి వెళ్లి తెలుగు నేర్చుకో #షేమ్ లెస్ టీడీపీ
ఆశ్చరం కాదురా లోకేశా.. ఆశ్చర్యం అనాలి
ఈ పకోడీ ట్వీట్లు వేయడం మానేసి వెళ్లి తెలుగు నేర్చుకో#ShamelessTdP https://t.co/ClMBTpqDZA
— Kodali Nani (@IamKodaliNani) October 27, 2018
జగన్ పై దాడి నేపథ్యంలో లోకేష్ ట్వీట్స్ కి కౌంటర్ గా కొడాలి నాని చేసిన ఈ ట్వీట్స్ సంచలనంగా మారాయి. వైసీపీ అభిమానులు ఈ ట్వీట్స్ ను వైరల్ చేస్తున్నారు.