Kethi Reddy: ఏపీ డిప్యూటీ సీఎం పై సెటైర్లు పేల్చిన కేతిరెడ్డి… బాదుడే బాదుడంటూ!

Kethi Reddy: వైకాపా పార్టీ అధినేత సూచనల మేరకు నిన్న విద్యుత్ చార్జీలపై రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నాయకులు నిరసనలు తెలియజేస్తూ ర్యాలీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా భారీ ఎత్తున కరెంటు చార్జీలు పెంచడంతో కరెంటు చార్జీలను తగ్గించాలి అంటూ వైకాపా నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. ఇందులో భాగంగా పాల్గొన్నటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించారు.

ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడే ఆరు నెలల అవుతున్న ఇప్పటివరకు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అందరికీ అందలేదని ఈయన కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఇక ఎన్నికల ప్రచార సమయంలో విద్యుత్ చార్జీలపై బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

ఇలా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా పక్కన పెట్టేయడం పట్ల కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు కూడా వేశారు. ఎన్నికల ప్రచార సమయంలో కరెంటు చార్జీల పెంపుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈయన మిమిక్రీ చేస్తూ సెటైర్లు వేశారు. దీంతో కేతిరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే కేతిరెడ్డి ధర్మవరంలో నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యను తెలుసుకొని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యలను తీర్చేవారు. ఈసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈయనకు మంత్రి పదవి కూడా ఖాయమని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా ధర్మవరంలో బిజెపి నుంచి సత్య కుమార్ పోటీ చేయడంతో ఐదు వేల ఓట్ల మెజారిటీతో సత్యకుమార్ విజయం సాధించారు.