విజయశాంతి గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన కవిత

గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ తెరపైకి వచ్చారు. ఎన్నికల బరిలోకి దిగను కానీ కాంగ్రెస్ తరపున రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తానంటూ ప్రకటించారు. తెలంగాణాలో టీఆరెస్ పార్టీ ఓటమే తన ధ్యేయమని వెల్లడించారు. కెసిఆర్ ని ఓడిస్తామంటూ సవాల్ చేశారు.

ఇప్పటికే పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు ఆమె. పలుసందర్భాల్లో ఆమె మాట్లాడుతూ కెసిఆర్ నన్ను దేవుడిచ్చిన చెల్లెలు అంటూనే మోసం చేసాడు అని తెలిపారు. రీజన్ లేకుండా పార్టీ నుండి సస్పెండ్ చేసారంటూ ఆరోపించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై పలు మీడియా ఛానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్పందించారు కెసిఆర్ కుమార్తె ఎంపీ కవిత.

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కెసిఆర్ పై పలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. రీజన్ లేకుండా నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు అని తెలిపారు. బహుశా నేను పార్టీలో ఉంటె కేటీఆర్, కవితకు అడ్డుగా ఉంటానని భావించి తొలగించారేమో అని విజయశాంతి పేర్కొన్నారు. కాగా ఆమె చేసిన ఈ ఆరోపణలను ఖండించారు కవిత. అవన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. ఆమే పార్టీని వదిలి వెళ్లిపోయారని కవిత చెప్పారు. కవిత ఏం చెప్పారో ఆమె మాటల్లోనే పూర్తిగా కింద ఉంది చదవండి.

తెలంగాణ డిక్లేర్ అవుతుండగానే ఆమె దిగ్విజయ్ సింగ్ ని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. టీఆరెస్ పార్టీ సెక్రెటరీ జనరల్ పదవిలో ఉన్న ఆమె పార్టీకి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎవరితో చర్చించకుండా, ఏం మాట్లాడకుండా డైరెక్ట్ గా ఢిల్లీ బోయి దిగ్విజయ్ సింగ్ ని కలిసి పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తికి కెసిఆర్ మీద మాట్లాడే అర్హత లేదు. ఆ వెంటనే వచ్చిన ఎలక్షన్స్ లో మెదక్ ప్రజలు ఆమె స్థానమేంటో చూపించారు కదా. మా హృదయాల్లో మీకు స్థానం లేదు అని చూపించారు కదా.

మళ్ళీ ఐదేళ్లు తర్వాత సడన్ గా ఎక్కడి నుండో వచ్చి దేవుడిచ్చిన చెల్లెలు అంటే… ఆనాడైనా ఈనాడైనా దేవుడిచ్చిన చెల్లి అన్నకు సపోర్ట్ గా ఉండాలి. ఎందుకు వెళ్లారు మీరు? ఎవరు పంపించారు మిమ్మల్ని? మీ నిర్ణయమే కదా? మేరె వెళ్లారు కదా కాంగ్రెస్ లోకి. అందులో కెసిఆర్ గారి పాత్ర ఏముంది? అని విజయశాంతిని నిలదీశారు కవిత.

ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ ఐంది. విజయశాంతి కేసీఆరే నన్ను సస్పెండ్ చేసాడు అంటుంటే కవితేమో విజయశాంతే టీఆరెస్ పార్టీని వదిలిపెట్టింది అంటున్నారు. దీంతో ఎవరి మాటలు నమ్మాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు జనాలు.