రాజకీయాల్లో కుల ప్రస్తావన లేకుండా సాధ్యమేనా.? ఛాన్సే లేదు.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్సలు సాధ్యం కాదది.! కులాల చుట్టూనే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం నడుస్తోంది.! ఇక, అసలు విషయానికొస్తే, కమ్మ పార్టీ, రెడ్డి పార్టీ, కాపు పార్టీ.. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రధాన రాజకీయ పార్టీల తీరు. రెడ్లంతా వైసీపీ వెంటే వుంటారా.?
కమ్మలంతా టీడీపీతోనే వుంటారా.? కాపులంతా జనసేనతోనే వుంటారా.? అన్నది వేరే చర్చ. ఆ ముద్ర అయితే అలా పడిపోయిందంతే. కమ్మ వర్సెస్ కాపు.. ఈ పంచాయితీ చాలాకాలంగా నడుస్తోంది. రెడ్డి వర్సెస్ కమ్మ.. ఈ పంచాయితీ వున్నా.. దీనికంటే పెద్ద పంచాయితీ కమ్మ వర్సెస్ కాపు.!
చిరంజీవిని రాజకీయంగా తొక్కేసింది టీడీపీనే.! అది జగమెరిగిన సత్యం. అప్పట్లో కాంగ్రెస్ కూడా కొంత పాపాన్ని మూటగట్టుకుంది. ఈ చర్చ ఇప్పుడెందుకంటే కమ్మ పార్టీ టీడీపీ, కాపు పార్టీ జనసేనను కౌగలించుకుంటోంది. ఇది కత్తుల కౌగలిగా అభివర్ణిస్తున్నారు కొందరు. కింది స్థాయిలో కార్యకర్తలైతే ఈ కలయికను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2014 నాటి పరిస్థితులు వేరు. 2024 ఎన్నికల నాటి పరిస్థితులు వేరు.
టీడీపీ – జనసేన కలయికతో.. రెండు పార్టీలకు లాభమెంత.? అన్నదానికంటే ముందు, నష్టమెంత.? అన్నది ఇరు పార్టీలూ బేరీజు వేసుకోవాల్సి వుంటుంది.