దేశ తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నియమితులయ్యారు. లోక్‌పాల్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. జ్యూడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్ కుమార్, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్ కుమార్. నాన్ జ్యూడీషియల్ సభ్యులుగా దినేష్ కుమార్ జైన్, అర్చనా రామసుందరం, మహేందర్ సింగ్, ఇందరజిత్ ప్రసాద్ గౌతమ్ నియమితులయ్యారు. ప్రధాని నేతృత్వంలో గత వారం సమావేశమైన ఎన్నిక కమిటీ పీసీ ఘోష్ పేరును ఖారారు చేసింది.
దేశ తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నియామకం
