వారసత్వ పోరు.! మోక్షజ్ఞ కోసం తారక్ బలి.!

యంగ్ టైగర్ ఎన్టీయార్ కాస్త ‘గ్లోబల్ స్టార్’గా ఎదిగాడు.! అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటున్న ప్రస్తుత తరుణంలో, ‘ఇంటిపోరు’ ఎక్కువైపోయిందాయనకి.! అసలు వాస్తవం ఏంటి.? అన్నది వేరే చర్చ. కానీ, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానుల్లో.. అలాగే నందమూరి అభిమానుల్లో మాత్రం ‘ఇంటిపోరు’పైనే ఎక్కువ రచ్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్ఝజ్ఞ కోసం జూనియర్ నందమూరి తారక రామారావుని కావాలనే పక్కన పెడుతున్నారన్న వాదన తెరపైకొచ్చింది.

అసలు ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎందుకు తెరపైకొస్తాయి.? అంటూ కొందరు నందమూరి అభిమానులు గుస్సా అవుతున్నారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. జూనియర్ ఎన్టీయార్‌కి ఈ విషయమై అన్యాయం జరుగుతోంది. జూనియర్ ఎన్టీయార్‌ని ట్రోల్ చేస్తున్నవారిలో అత్యధికులు నందమూరి అభిమానులే వుంటున్నారు.

‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీయార్.. టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీయార్ కైవసం చేసుకోవాలి’ లాంటి నినాదాలు, జూనియర్ నందమూరి తారక రామారావుని ఇబ్బంది పెడుతున్నాయి.

అయితే, అభిమానుల సెంటిమెంట్లు అలా వున్నాయ్ మరి.! వీటిని కావాలనే ఎవరైనా ఎగదోస్తున్నారా.? నిజంగానే జూనియర్ ఎన్టీయార్ అభిమానులు అలా ఆలోచిస్తున్నారా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తుండడం సబబే.

రాజకీయంగా జూనియర్ ఎన్టీయార్ ముందడుగు వేయకుండా నందమూరి బాలకృష్ణ తనవంతు కృషి చేస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్. సినీ రంగంలో స్వర్గీయ ఎన్టీయార్ లెగసీని కొనసాగిస్తున్న జూనియర్ ఎన్టీయార్‌ని ఇక్కడా తొక్కేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా.?