యంగ్ టైగర్ ఎన్టీయార్ ఘోర అవమానాల్ని ఎదుర్కొంటున్నాడు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, నందమూరి అభిమానులు అసలంటూ జూనియర్ ఎన్టీయార్‌కీ నందమూరి కుటుంబానికీ సంబంధం లేదంటున్నారు. ‘హరికృష్ణకీ మీ అమ్మకీ పెళ్ళయినట్లు ఒక్క ఆధారం చూపించు’ అంటూ నిస్సిగ్గుగా అడుగుతున్నారు.
మరిప్పుడు జూనియర్ ఎన్టీయార్ ఏం చేయాలి.? ‘నా పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్.. నా చిన్న కొడుకు జూనియర్ ఎన్టీయార్..’ అని మహానాడు వేదికగా గతంలో నందమూరి హరికృష్ణ ప్రకటించినప్పుడు, ఇదే నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలూ జేజేలు పలికారు కదా.?
గతంలో.. అంటే, 2009 ఎన్నికల సమయంలో అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మీదకు జూనియర్ ఎన్టీయార్‌ని ప్రయోగించారు చంద్రబాబు. తెలిసీ తెలియని కుర్రతనంతో, చిరంజీవి మీదా సెటైర్లేశాడు జూనియర్ ఎన్టీయార్.
ఇప్పుడేమయ్యింది.? ఆ టీడీపీనే, ఎన్టీయార్ పేరులోని ‘నందమూరి’ అనే ప్రస్తావనను ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో, జూనియర్ ఎన్టీయార్ బలప్రదర్శనకు దిగాల్సిందేనంటున్నారు ఆయన అభిమానులు.
అతి త్వరలో జూనియర్ ఎన్టీయార్ బల ప్రదర్శన చేయబోతున్నారట. పొలిటికల్ టచ్ వుండేలా, ఓ కార్యక్రమాన్ని.. ఓ బహిరంగ సభని జూనియర్ ఎన్టీయార్ ప్లాన్ చేస్తున్నాడన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.