ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి వైసీపీ మినహా ఇతర పార్టీలతో పోల్చి చూస్తే మెరుగ్గానే ఉంది. తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ పుంజుకోవడం కష్టమేనని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం కథ ముగిసినట్లేనని క్లారిటీ వచ్చింది. నందమూరి సుహాసిని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయారు.
హరికృష్ణ కూతురు, జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కూకట్ పల్లి నియోజకవర్గం తరపున పోటీ చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశంకు భవిష్యత్తు లేకపోవడంతో చంద్రబాబు ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారని తెలుస్తోంది. రెండు తెలుగు దృష్టి పెట్టడం కరెక్ట్ కాదని చంద్రబాబు భావిస్తున్నట్టు బోగట్టా.
ఏపీలో అధికారం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తుండటం గమనార్హం. గతంలో టీడీపీ తరపున కూకట్ పల్లి నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసినికి భారీ షాక్ తగిలింది. అయితే సుహాసినికి రాజకీయాలపై ఆసక్తి మాత్రం పోలేదని తెలుస్తోంది. ఆర్థికంగా బలమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నందమూరి సుహాసిని కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆమెకు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. అయితే టీడీపీతో పోల్చి చూస్తే మాత్రం బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కోసం బీజేపీ ఎదురుచూస్తున్న సమయంలో సుహాసిని కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.