టిడిపి ఎమ్మెల్యే మీద తొడగొట్టిన పవన్ కల్యాణ్…

దెందులూరు తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు జనసేనాని పవన్ కల్యాణ్ గతంలో ఎవరూ ఎపుడూ ఇవ్వనంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

‘మరోసారి నువ్వు ఎవ్వరిని  తిట్టినా, కొట్టినా సహించను,  నేను దెందులూరు వస్తా.  తెల్చుకుంటా,’ అని జనసేన అధిపతి పవన్
దెందులూరు సభలో  నుంచే పవన్ హెచ్చరిక చేశారు. 

దెందులూరు సభలో పవన్ కల్యాణ్

అక్కడి సభలో  ప్రసంగిస్తూ కొందరు  రౌడిమూకలు సభను అడ్డుకుంటామని హెచ్చరించారని, అలాంటి వారికి బయపడేది లేదుపొమ్మన్నారు.

‘మమ్మల్ని బెదిరిస్తే కాళ్లు విరగ్గొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.15 ఏళ్లకే సాయుధ పోరాటంలో పాల్గొనాలని అనుకున్న వాడిని.రాష్ట్ర విభజన సమయంలో బాధ్యతగా ఉండాలని బావించాను,’ అని అంటూ ప్రభుత్వ విప్ గా ఉన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి  క్రమశిక్షణ లేదు,అలాంటి వ్యక్తి అసెంబ్లీని ఎలా క్రమశిక్షణలో పెడతారని ఆయన ప్రశ్నించారు.

చింతమనేని ప్రభాకర్

ఇలాంటి వారిని విప్ గా ఎలా చేశారని ఆయన లోకేష్ కు సభా ముఖంగా ప్రశ్నవేశారు.

చింతమనేని అక్రమాలను వివరిస్తూ, ‘ కొల్లేరులో కబ్జాలకు పాల్పడుతూ… అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు.25 కేసులున్న వ్యక్తులను తెలుగు దేశం పార్టీ వెనకేసుకొస్తోంది. రాజకీయాల్లో రాజ్యాంగాన్ని గౌరవించేవారు ఉండాలి గాని రౌడీమూకలు కాదు,’ అని అన్నారు.

చంద్రబాబుకు జగన్ అంటే భయం

తనకు తెలుగుదేశం కుదిరిన ఒక ఒప్పంద గురించి చెబుతూ , టిడిపికి  మద్దతిచ్చినపుడు నేను కోరింది శాంతి భద్రతల గురించి.ఆడపడుచులకు భద్రత కావాలని చంద్రబాబుని కోరాను.  నేను అనుకున్నవి ఆయన అనుభవంతో చేస్తారని నమ్మాను. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు భోజనానికి పిలిచారు. తేదేపా అధికారంలోకి రాకుంటే మనం కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు.వైసీపీ అంటే చంద్రబాబుకు అంత భయం. అలాంటపుడు ధైర్యంగా చంద్రబాబుకు అండగా నిలిచింది జనసేన,’అని చెప్పారు.

ఎమ్మెల్యే, ఎంపీలు పోలీసులను తిడుతున్నా డిజిపి స్పందించకపోతే ఎలా అని అంటూ ఇలాంటి ఎమ్మెల్యే(చింతమనేని) మీద చర్యలు తీసుకోకుండా పోలీసులు, న్యాయ వ్యవస్థ, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు.

మహిళలపై బూతులు మాట్లాడే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే ప్రజలే ఇలాంటి వారిని కొటిచంపేస్తారు. మహిళలపై దాడులు జరిగుతుంటే తెదేపా సర్కారు ఏం చేస్తోంది..

పవన్ ఇంకా ఏమన్నారంటే..

ముఖ్యమంత్రి సింగపూర్ తరహా రాజధాని కడతానని అంటున్నారు.

ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలు ఉంటే సింగపూర్ రాజధాని ఎట్లా సాధ్యం?

విదేశాల్లో అయితే ఇలాంటి వ్యక్తులను చట్టసభల్లోకి రానివ్వరు?

కానీ దెందులూరులో మాత్రం మనం భరించాల్సి వస్తోంది?

కులం పేరుతో ఎస్సీలను తిడుతుంటే ఎమ్మెల్యేపై చర్యలు ఉండవా?

అలాంటప్పుడు దళిత తేజం పేరుతో కార్యక్రమాలు ఎందుకు?

ఇలాంటివి జరుగుతుంటే పోలీసులు చేతులు కట్టుకుని కూర్చుంటే… చట్ట వ్యతిరేక శక్తులు రంగంలోకి దిగుతాయి.

ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రవాద ఉద్యమం ప్రబలే ప్రమాదం ఉంది.

జనసేన కార్యకర్తలు జెండా కడితే పోలీసులు హెచ్చరికలు… కానీ ఎమ్మెల్యే ఇన్ని అరాచకాలు చేస్తున్నా పటించుకోరా?

డిజిపి గారు, ముఖ్యమంత్రి గారూ ఇలాంటి వ్యక్తులను క్రమశిక్షణలో పెట్టండి?

వనజాక్షిపై దాడి చేసినపుడు స్పందించి ఉంటే ఇపుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు?