తిత్లీ బాధితుల తరఫున గవర్నర్ ను కలసిన పవన్ కల్యాణ్

తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం పెద్ద ఎత్తున పునరావాస, స హాయ చర్యలు చేపట్టాలని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ ను కోరారు.

   ఈ మధ్య ఆయన  తిత్లి ప్రభావిత ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి అక్కడి భాదితుల పరిస్థితులను తెలుసుకున్నారు.

అక్కడ జరిగిన నష్టం మీద, పునరావాస చర్యల  మీద ఆయన గవర్నర్ కు వినతి పత్రం అందించారు. 

తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో వంద శాతం రుణ‌మాఫీ చేయాలని, అదే స‌మ‌యంలో 10 ఏళ్ల పాటు రైతుల‌కి ప‌రిహార భృతి ఇవ్వాలని ఆయన గవర్నర్ ను కోరినట్లు తెలిసింది. ఇప్ప‌టికీ చాలా గ్రామాల‌కి నీరు, ఆహారం కూడా అంద‌డం లేద‌ని బాధితులు తమకు చెప్పిన వివరాలను ఆయన గవర్నర్ దృష్టకి తీసుకువచ్చారు. ప‌రిహారం కోసం ప్ర‌శ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నార‌నీ ఆయన గవర్నర్ చెప్పారు.  జనసేన ఇంకా ఈ సమావేశం మీద  అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.