పవన్ తన రాజకీయ ప్రత్యర్థులను ఆడుకోవటం ఏమో కానీ సొంత కార్యకర్తలను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. పవన్ సినిమాలు వదిలి రాజకీయాలు అనగానే లక్షల మంది జనసేనలో చేరారు. అధికారికంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అలా పార్టీ జెండా పట్టుకున్న వారిలో కొందరు మధ్యలోనే దిగిపోయినా ఇంకొందరు మాత్రం నిలబడ్డారు. అభిమానుల నుండి పూర్తిస్థాయి రాజకీయపార్టీ కార్యకర్తలుగా మారిపోయారు. ఇన్నాళ్లు వీళ్ళే పార్టీని నడుపుకుంటూ వచ్చారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశారు.
జనంలోకి పార్టీని తీసుకెళ్లడానికి వీరు చేసిన కృషి అంతా ఇంతా కాదు. మీడియా మద్దతు లేని పవన్‌ను భుజాల మీదపెట్టుకుని ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ అదే కష్టం చేస్తున్నారు. అయితే వారికి పవన్ నుండి తగిన ప్రోత్సాహం లభించట్లేదు. చీటికీ మాటికీ పవన్‌లోని అలసత్వం, కమిట్మెంట్ లేమి బయటపడుతూ ఉండటంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. సినిమాల్లోకి వెళ్ళేది లేదు అంటూ ప్రతిజ్ఞ చేసిన పవన్ సినిమాల్లోకి వెళ్లినా పెద్దగా ఫీల్ కాలేదు కార్యకర్తలు. సినిమాలు చేసుకుంటూనే పార్టీను నడుపుకోవచ్చని కన్విన్స్ అయ్యారు.
వాళ్ళు కన్విన్స్ అయినంతగా పవన్ కమిట్ కావడంలేదు, గత ఆరు నెలలుగా పార్టీ ఊసే లేదు. పవన్ బయటికొచ్చి శ్రేణులను కలిసిన దాఖలాలు లేవు. ఇకపైనైనా వస్తాడా అంటే ఇంకొన్ని నెలలు చెప్పలేని పరిస్థితి. ఇదంతా చూస్తున్న కార్యకర్తలకు కోపం తన్నుకొస్తోంది. కానీ ఏం చేస్తారు. ఇప్పటికే పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ ఎద్దేవా చేస్తున్న ప్రత్యర్థులు ఇప్పుడు తాము కూడ నోరు తెరిచి గొల్లుమంటే మరింత హేళన చేస్తారని మౌనంగానే పవన్ అలసత్వాన్ని భరిస్తున్నారు. కానీ లోపల మాత్రం వారి సిట్యుయేషన్ ఎవరో ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నట్టుగా ఉందట. ఆడుకుంటున్నది ఎవరో కాదు పవన్ కళ్యాణే మరి.