టీడీపీ కీలకనేత , మాజీ మంత్రి నారా లోకేష్ ఎక్కువగా ట్విట్టర్ ద్వారానే ప్రభుత్వం పై , సీఎం వై ఎస్ జగన్ పై విరుచుకుపడుతుంటారు. తాజాగా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఈ తరుణంలో నారాలోకేష్ వైసీపీ ప్రభుత్వం పై , సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వరుస ట్విట్స్ తో ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు.
పేదలకు అది సెంటు స్థలమే అయినా, వైసీపీ ఎమ్మెల్యేకు అది కుంభస్థలమని అన్నారు. స్థల సేకరణ నుంచి పంపిణీ వరకు అన్నింటా అవినీతేనని, పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పేరుతో జగన్ చేస్తున్న త్రీ ఇన్ వన్ స్కాం విలువ రూ. 6,500 కోట్లు అని ఆరోపించారు.
తమ హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు నీలం రంగువేసినంత మాత్రాన సైకిల్ బ్రాండ్ ఎంతమాత్రమూ చెరిగిపోదన్నారు. కొండలు, గుట్టలు, శ్మశానాలు, చెరువుల్లో జగన్ ఇంట్లోని మరుగుదొడ్డి కంటే తక్కువగా ఇచ్చే స్థలంలో పేదలు ఉంటారనుకోవడం పొరపాటేనని లోకేశ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌తోపాటు చిప్పకూడు తినడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాల్లో వేసిన కేసుల వల్లే ఇంటి స్థలాలను ఇవ్వలేకపోయామని చెబుతూ వచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడెలా వాటిని పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు. అందుకే జగన్ రెడ్డిని ఫేక్ సీఎం అని పిలుస్తుంటారని నారా లోకేష్ విమర్శించారు.
పేదలకది సెంటు స్థలం,@ysjagan కి,వైకాపా ఎమ్మెల్యేలకు అది కుంభస్థలం.స్థల సేకరణ లో అవినీతి,చదును పేరుతో దోపిడీ,పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చడం.మొత్తంగా పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ 6,500 కోట్లు.(1/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 25, 2020
టిడిపి హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రానా సైకిల్ బ్రాండ్ చేరిగిపోదు.నీ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువుగా కొండలు,గుట్టలు,శ్మశానాల్లో,చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదు.(2/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 25, 2020
ఇప్పుడున్న ఆధారాలతో జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డి తో పాటు చిప్పకూడు తినడం ఖాయం.ఇప్పటి వరకూ టిడిపి కేసుల వలనే స్థలం ఇవ్వలేక పోతున్నాం అన్నావ్.మరి ఇప్పుడెలా ఇస్తున్నావ్ జగన్ రెడ్డి, అందుకే నిన్ను ఫేక్ సిఎం అనేది.(3/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 25, 2020