2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కారణమేంటనే ప్రశ్నకు జవాబుగా వేర్వేరు కారణాలు వినిపిస్తాయి. పలువురు సినీ ప్రముఖులు జగన్ ను అనుకూలంగా చేసిన ప్రచారం సైతం ఆయనకు ఒక విధంగా ప్లస్ అయింది. అయితే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత ఒకరిద్దరు సినీ ప్రముఖులు మినహా మిగిలిన వాళ్లకు పదవులు ఇవ్వలేదు. జగన్ సర్కార్ పదవులు ఇవ్వకపోవడంపై పలువురు సినీ నేతల్లో అసంతృప్తి ఉంది.
అయితే జగన్ సర్కార్ అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి సినీ ప్రముఖులు ఆసక్తి చూపడం లేదు. జగన్ తలచుకుంటే అలీ, పోసాని కృష్ణమురళి, మోహన్ బాబు, మరి కొందరు సినీ ప్రముఖులకు ఏదో ఒక పదవి ఇవ్వడం కష్టం కాదు. గత కొన్నిరోజులుగా అలీ వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లనున్నారంటూ ప్రచారం జరగగా ఆ ప్రచారాన్ని అలీ ఖండించిన సంగతి తెలిసిందే.
అయితే ఇలాంటి పరిస్థితి వైసీపీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందని విశ్లేషకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పార్టీ మార్పు విషయంలో భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకుంటే సమాచారం ఇచ్చి పార్టీ మారతానని అలీ వెల్లడించడం గమనార్హం. రాబోయే రోజుల్లో వైసీపీని నమ్ముకున్న ఇతర నేతల గురించి సైతం ఈ తరహా ప్రచారం జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఎన్నికలకు 19 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వైసీపీ కొన్ని విషయాలకు సంబంధించి మారాల్సి ఉంది. వైసీపీ కొన్ని విషయాలలో నిర్లక్ష్యంలో వ్యవహరిస్తే అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఏపీ సీఎం జగన్ సలహాదారులు జగన్ ఎన్నికల్లో గెలవడానికి ఉన్న ప్రతి విషయాన్ని గుర్తు చేసి వైసీపీ గెలుపు కోసం కష్టపడాల్సి ఉంది. సీఎం జగన్ అలీ, ఇతర సినీ నేతలకు సంబంధించి ఎలా ముందుకెళతారో చూడాలి.