రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు.. అన్ని లక్షల ఉద్యోగాలను జగన్ కల్పించనున్నారా?

గత కొన్నేళ్ల నుంచి ఏపీలో అభివృద్ధి జరగడం లేదని హైదరాబాద్ కు పోటీనిచ్చే ప్రాంతం ఏదీ ఏపీలో లేదని విమర్శలు వినిపించాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ డబ్బులను పప్పూ బెల్లాల్లా పంచిపెడుతున్నారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. యువత గురించి, నిరుద్యోగుల గురించి జగన్ అస్సలు ఆలోచించడం లేదని చాలామంది తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ పదేళ్లు వెనుకబడిపోయిందని మరి కొందరు కామెంట్లు చేశారు.

అయితే ఎవరైతే తనపై తన పార్టీపై విమర్శలు చేశారో ఒకే ఒక్క పని ద్వారా జగన్ వాళ్లందరి నోర్లు మూయించాడు. 13 లక్షల కోట్ల పెట్టుబడులతో 6 లక్షల ఉద్యోగాలను కల్పించే దిశగా జగన్ అడుగులు వేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఏపీలో పెట్టుబడులు పెట్టే దిశగా జగన్ అడుగులు వేయడం గమనార్హం. మరికొన్ని సంవత్సరాల్లో జగన్ విశాఖను హైదరాబాద్ కు పోటీనిచ్చేలా తీర్చిదిద్దడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

త్వరలో విశాఖకు సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం వచ్చేలా జగన్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వాళ్ల వేతనాలు అంతకంతకూ పెరిగే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారు. జగన్ ఈ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ ను సక్సెస్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. వైసీపీకి ఇందుకు సంబంధించి జనసేన నుంచి కూడా సపోర్ట్ లభించింది.

శత్రువులను సైతం మెప్పించాడంటే జగన్ ఏ స్థాయిలో విజయం సాధించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో అనుకూల తీర్పు వస్తే మాత్రం ఏపీలో అభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు పడే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.