బిగ్ బ్రేకింగ్: టిడిపి మంత్రి నారాయణకు ఊహించని షాక్

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల నాయకులకు భయం పట్టుకుంది. ఏ నిమిషంలో ఎవరిపై ఎలాంటి కేసులు మెడకు చుట్టుకుంటాయి అని వణికిపోతున్నారు. గత వారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిన ఐటి దాడులు చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా ఈ ఘటన హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో కూడా ఐటి దాడులు మొదలైనట్టు తెలుస్తోంది. ఏపీ టిడిపి మంత్రి నారాయణ ఆస్తులపై శుక్రవారం తెల్లవారుఝాము నుండి ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు అని తెలుస్తోంది.

మంత్రి నారాయణకు సంబంధించిన కళాశాలలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పోలీసుల బందోబస్తులో ఈ ఐటి సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నారాయణ కాలేజీలకు చేరుకుంటున్నారు అధికారులు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఆయనకు సంబంధిన ఆస్తులపై ఐటి అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి కొందరు నాయకుల ఇళ్లలో కూడా ఐటి దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా టిడిపి నేతల్లో భయం మొదలైనట్టు తెలుస్తోంది. 

అయితే దీనిని ఖండిస్తున్నారు నారాయణ సంస్థలకు సంబంధించిన బృందం. నారాయణ కాలేజీలలో కానీ, ఆయన ఇంట్లో కానీ, బంధువుల ఇంట్లో కానీ సోదాలు జరగట్లేదని చెబుతున్నారు. కానీ స్థానికులు మాత్రం పెద్ద ఎత్తున అధికారులు 10 కార్లలో రావడం గమనించినట్టు చెబుతున్నారు.

 మాకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో నారాయణ సంస్థలపై ఐటీ దాడులు మొదలయ్యాయి. పలుచోట్ల, విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.  విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఈ దాడుదలు నిర్వహిస్తున్నారు.  పోలీసుల రక్షణలో సోదాలు చేస్తున్నరాని కూడా తెలిసింది.  అంతకముందు విజయవాడ ఆటోనగర్‌లోని ఆఫీసులో సోదాలపై కార్యాచరణ రూపొందించిన ఐటీ అధికారులు.

నెల్లూరు : దగదర్తి మండలం దామవరంలోని బీఎంఆర్ ఫ్యాక్టరీపై ఐటీ దాడులు జరిగాయని  కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం అధికారులు స్వాదీనం చేసుకున్నారని తెలిసింది.  ఈ దాడులు ఇంకా  కొనసాగుతున్నాయి.  అయితే, ఇది  టిడిపి నేత  బీద మస్తాన్ రావు ఫ్యాక్టరీగా అని తెలిసింది.  చెన్నైలోని బీద మస్తాన్ రావు ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నట్లుసమాచారం అందింది.