జగన్ హత్య కోసమే పర్మిషన్ తీసుకున్నారా ? బయటపడిన ఆధారం

చూడబోతే తాజాగా బయటపడిన ఆధారాలను చూస్తుంటే అలాగే అనుకోవాల్సొస్తోంది. పోయిన నెల 25వ తేదీన జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. హత్యాయత్నం కూడా భారీ భద్రత ఉండే విశాఖపట్నం విమానాశ్రయం లాంజులో. హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణకు జగన్ అండ్ కో డిమాండ్ చేస్తుంటే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎందుకు నిరాకరిస్తోంది ? కేవలం సిట్ విచారణకు ఆదేశించి ఎందుకు చేతులు దులుపుకుంది ? ఇటువంటి ప్రశ్నలకు తాజాగా బయటపడిన ఓ ఆధారమే సమాధానం చెబుతోంది.

ఇంతకీ  తాజాగా బయటపడిన ఆధారమేంటి ? ఏమిటంటే, జగన్ పై హత్యాయత్నంకు ముందే నిందితుడు శ్రీనివాస్ ఎయిర్ పోర్టులో ఎక్కడైనా అంటే చివరకు చెక్ ఇన్ పాయింట్ వరకూ కూడా తిరగటానికి టిడిపి నేత, ఎయిర్ పోర్టులో క్యాంటిన్ యజమాని హర్షవర్ధన్ చౌదరి పర్మిషన్ తీసుకున్నారు. అనుమతి కూడా పై ఉన్నతాధికారుల సమ్మతి లేకుండానే విశాఖపట్నం విమానాశ్రయం డైరెక్టర్ వేణుగోపాలే ఇచ్చాశారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న శ్రీనివాస్ కు ప్రముఖులు కూర్చునే లాంజ్ దాకా పర్మిషన్ ఎలా ఇచ్చారు ? క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నిందితుడిని అసలు క్యాంటిన్లోకి తీసుకోవటమే తప్పంటే విమానాశ్రయంలో స్వేచ్చగా తిరిగేందుకు పర్మిషన్ బోనస్ లాంటిదే.

పైగా తీసుకున్న పర్మిషన్ కూడా అక్టోబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకే. క్యాంటిన్లో పనిచేసే వాళ్ళకు నెల రోజులకు మాత్రమే పర్మిషన్ తీసుకోవటం ఏమిటి ? పర్మిషన్ తీసుకుంటే పూర్తిగా తీసుకోవాలి కానీ నెల రోజులకు మాత్రమే తీసుకోవటంతోనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే,  జగన్ పై హత్యాయత్నం జరిగింది కూడా అక్టోబర్ 25వ తేదీనే కావటం గమనార్హం. అంటే జగన్ ను హత్య చేయటం కోసమే ముందుగా అనుమతి  తీసుకున్నట్లైంది. అనుమతి తీసుకున్నప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నారనే అనుకోవాలి. కానీ సాధ్యం కావటం లేదు. ఒకవైపు తీసుకన్న అనుమతి గడువు అయితోంది. ఇంకోవైపు హత్యాయత్నం సాధ్యం కావటం లేదు. అందుకనే అక్టోబర్ 25వ తేదీన తెగించి దాడి చేశాడు.

జగన్ అండ్ కో డిమాండ్ చేస్తున్నట్లు థర్డ్ పార్టీ విచారణ కానీ న్యాయవిచారణ చేయిస్తే హత్యాయత్నం కుట్ర అంతా  బయటకు వస్తుందని ప్రభుత్వ పెద్దలకు అర్ధమైంది. అందుకనే తమ చెప్పుచేతల్లో ఉండే సిట్ తో విచారణ చేయించి చేతులు దులుపుకున్నారు. మొత్తానికి జగన్ డిమాండ్  చేస్తున్నట్లుగా న్యాయవిచారణ కానీ సిబిఐ విచారణ కానీ చేయిస్తే వాస్తవాలు బయటకు వచ్చి ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పడటం ఖాయమే అనిపిస్తోంది.